కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి సవాల్ చేశారు. అదే లైన్‌లో కాకినాడలో ద్వారంపూడిపై పోటీ చేస్తారో... తనపై పిఠాపురంలో పోటీ చేస్తారో తెల్చుకోవాలని ముద్రగ పద్మనాభం ఛాలెంజ్ విసిరారు. దీనిపై సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు కూడా విమర్శలు చేశారు. అన్నింటినికీ ఒక సమాధానంతో తేల్చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. 


వైసీపీపై వార్‌


వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మలికిపురం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూనే వైసీపీ గెలవకుండా చేస్తామంటూ శపథం చేశారు. 2024లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వం పోతుందన్నారు పవన్ కల్యాణ్. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 


పవన్‌కు ముద్రగడ, ద్వారంపూడి ఛాలెంజ్


గత కొన్ని రోజులుగా పవన్‌పై వైసీపీ నేతలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పేర్ని నాని, అమర్నాథ్‌, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ విమర్శల దాడి పెంచారు. వీళ్లకు సపోర్ట్‌గా ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తూ సవాళ్లు విసిరారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేరని... కనీసం తన సీటు ఎక్కడో కూడా తెలియదని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. 


మద్దతు పలికిన వైసీపీ నేతలు


అందరికీ కలిపి ఒకే సమాధానం ఇచ్చారు జనసేనాని. తాను పోటీ చేసిన చోటు చెప్పకపోయినా అసలు ఉమ్మడి ఈస్ట్, వెస్ట్‌లో వైసీపీ ఒక్కసీటు కూడా గెలవకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. జనసేనని ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్‌ చేసిన వాళ్లకు ప్రతి సవాల్ చేశారు. 


ద్వారంపూడి ధ్వజం 


గత వారం కాకినాడ టౌన్‌లో సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి బయటపెట్టి ప్రజల ముందు కూర్చోబెడతామన్నారు. కాకినాడను అక్రమాలకు అడ్డగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. దీనిపై రియాక్ట్ అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అంత దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. 24 గంటల్లో దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 


Also Read: అంబేడ్కర్‌ కంటే ఏపీ సీఎం గొప్పోడా, పథకానికి జగన్ పేరు పెట్టుకోవడంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు!


ముద్రగడ లేఖల


అదే రోజు నుంచి ముద్రగడ పద్మనాభం కూడా పవన్‌ను క్వశ్చన్ చేస్తూ లేఖలు రాయడం మొదలు పెట్టారు. ద్వారంపూడిని, వైసీపీకి మద్దతు ఇస్తూ  అసలు రాజకీయాల్లో పవన్ జీరో అంటూ విమర్శలు చేశారు. అంత ధైర్యం ఉంటే ద్వారంపూడి సవాల్‌ను స్వీకరించి పోటీకి రెడీ అవ్వాలన్నారు. అలా కాకుంటే పిఠాపురంలో తన పోటీకి సవాల్ చేయాలన్నారు. 


అందరికీ కలిపి ఒకటే కౌంటర్ 


ఈ ఇద్దరి కామెంట్స్‌కు వైసీపీ లీడర్లు కూడా మద్దతు తెలిపారు. పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఆదివారం వరకు పవన్ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ మలికిపురం బహిరంగ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ప్రకటించారు. తాను పోటీ చేయడం పక్కన పెడితే గోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తానంటూ ప్రతినబూనారు. 


Also Read: నా మీద చెయ్యి పడినా, రాయి పడినా తన్ని తగలేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్!


జనసేన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటారు.. మీ ఇసుక దోపిడీ, మీ దౌర్జన్యాలను అడ్డుకోకపోతే తనపేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు అన్నారు. దేవాలయాలను కాల్చేసిన వారిని మీరు వెనుకేసుకొస్తారు. సొంత చిన్నానను చంపిన అనకొండ అని సంచలన ఆరోపణలు చేశారు. దళితులకు మేనమామ అనే చెప్పుకుని దళిత పథకాలు తీసేశారని సీఎంపై పవన్ సెటైర్లు వేశారు. విదేశీ విద్య పథకానికి జగన్‌ పేరు పెట్టుకున్నారు, అంబేడ్కర్‌ కంటే మీరు గొప్పవారు కాదు అన్నారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial