Why was KTR not arrested : తెలంగాణ హైకోర్టు నుంచి కేటీఆర్ పది రోజుల పాటు అరెస్టు చేయకుండా ఊరట పొందారు. అరెస్టు నుంచి తప్పించుకుని ఆయన ఆజ్ఞాతంలోకి పోయి ఈ ప్రయత్నాలు చేయలేదు. ఆయన అసెంబ్లీకి హాజరవుతునే ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన అరెస్టుపై జరుగుతున్న ప్రచారాన్ని రెగ్యులర్ ఫాలో అవుతున్నారు. తాను రెడీగా ఉన్నానని చాలా సార్లు ట్వీట్లు  కూడా చేశారు. ఇదిగో అరెస్ట్ .అదిగో అరెస్ట్ అని మీడియాలోనూ హడావుడి జరిగింది.తీరా కేసు నమోదు చేసిస కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందే వరకూ పట్టించుకోలేదు. కానీ ఆ అంశంపై చర్చ జరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు కల్పించారు. 


అరెస్టుతో రాజకీయంగా నష్టం 


రాజకీయ నేతల అరెస్టు సున్నితమైన విషయం. వారిని అరెస్టు చేస్తే సింపతీ వస్తుంది. కేసీఆర్ ను తాను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని ఆయనే తనను శత్రువుగా ఎంచుకున్నారని రేవంత్  రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన అలా టార్గెట్ చేయబట్టే తాను పట్టుదలతో ఈ స్థాయికి వచ్చానని చెబుతూంటారు. అవునన్నా..కాదన్నా రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ హయాంలో జరిగిన వేధింపులు ఆయనలో పట్టుదల పెంచడంతో పాటు ప్రజల్లో సానుభూతిని కూడా పెంచాయని అనుకోవచ్చు. వారు చేసిన తప్పును తాను చేయాలనుకోవడం లేదని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే అరెస్టుల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గుతారా అంటే..  అరెస్టు చేయడం సమంజసమే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించిన తర్వాత తాను చేయాలనుకున్నది చేస్తారని అంటున్నారు. 



Also Read: CM Revanth Reddy: 'ఈ కార్ రేస్‌పై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం' - బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లైనా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్




ఒక్క అంశం తో ఆగేది లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా పలు కేసుల్లో కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా నిందితులుగా ఉంటారని చెబుతున్నారు అయితే తనను గతంలో అరెస్టు చేయించినట్లుగా దూకుడుగా అరెస్టు చేయించరని.. న్యాయపరంగా అన్ని అవకాశాలు కల్పించిన తర్వాతనే.. ఇక అరెస్టు తప్ప మరో మార్గం లేదన్న  అభిప్రాయం ఏర్పడిన తర్వాతనే అరెస్టు చేస్తారని అంటున్నారు.  ఉన్న పళంగా రాత్రికి రాత్రి అరెస్టు చేస్తే చట్టాలను చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతల్ని వేధిస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది. అందుకే  న్యాయపరమైన అవకాశాలు అన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చిన తర్వాతనే జైలుకు పంపుతారని అంటున్నారు. 



Also Read: CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం




రేవంత్ రెడ్డి ఎంతో ఆవేశంగా రాజకీయంగా చేస్తున్నట్లుగా కనిపిస్తారు.కానీ చర్యల్లో మాత్రం అంత దూకుడు కనిపించడం లేదు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని విషయాల్లోనూ ఆయన అదే పద్దతి పాటిస్తున్నారు. హైడ్రా విషయంలో ఆయన తగ్గేది లేదని చాలా సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు గత జూలై నుంచి కట్టే అక్రమ కట్టడాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. మూసి విషయంలోనూ అంతే.  పట్టు విడుపులు ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నారు. అదే సమయంలో  రాజకీయంగా లాభనష్టాలు వేసుకుని ముందడుగు వేస్తున్నారు.  ఈ విషయంలో రేవంత్ రెడ్డి చర్యలను కూడా ఊహించడం కష్టమని అంచనా వేస్తున్నారు.