ఏపీ కొత్త మంత్రివర్గంలో ( AP New Cabinet )  ఎవరెవరు చోటు దక్కించుకుంటారన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో మళ్లీ ఎవరెవరు పదవులు నిలబెట్టుకుంటారన్న చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్ సమావేశంతో పాటు వైఎస్ఆర్‌ఎల్పీ సమావేశంలోనూ జగన్ సామాజిక సమీకరాల కారణంగా కొంత మందిని కొనసాగిస్తామని హింట్ ఇచ్చారు. ఆ కొంత మంది ఎవరనేది ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ( YSCRCP ) ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్‌గా మారిది. ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి వంద శాతం మంత్రులను మారుస్తారని అనుకున్నారు. కానీ సీనియార్టీ, రాజకీయంగా పట్టు ఉండటం, సామాజిక సమీకరణాలు అన్నీ చూసుకుంటే కొంత మందిని కదిలించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలు్సతోంది. ప్ర‌ధానంగా అత్యంత సీనియ‌ర్ గా గుర్తింపు ఉన్న పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ( Minister Peddi reddy ) తప్పనిసరిగా కొనసాగించే్ అవకాశం ఉంది. ఎలాంటి ఎన్నికలు జరిగినా ఆయన పార్టీని గెలిపించి తీసుకు వచ్చారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ విజయానికి ఆయనే కారణం. 


అలాగే  ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ రెడ్డి ( Buggana ) , బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డికి ( balineni Srinivas REddy ) కూడా కొనసాగింపు లభించబోతోందన్న ఊహాగానాలు వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తున్నాయి. బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక శాఖను బాగా డీల్ చేస్తున్నారని మరొకరు అయితే కష్టమని భావిస్తున్నారు. అదే సమయంలో  బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్‌కు దగ్గర బంధువు. కుటుంబ అంశాలు ఆయన కొనసాగింపునకు దోహదం చేస్తాని భావిస్తున్నారు.  ఇక మ‌రో మూడు సామాజిక వ‌ర్గాల నుండి కూడ జ‌గ‌న్ త‌న క్యాబినేట్ లో మంత్రులుగా కంటిన్యూ చేసేందుకు స‌న్న‌ద్దం అయ్యార‌ని అంటున్నారు. 


కాపు,క‌మ్మ‌,తూర్పు కాపు వ‌ర్గాల నుండి పేర్ని  నాని (Perni Nani ) , కొడాలి నాని ( Kodali Nani ) ,బోత్స ( Botsa ) ల‌కు మ‌రో సారి ఛాన్స్ ద‌క్క‌నుంది..అంతే కాదు,ఆర్య వైశ్య సామాజిక వ‌ర్గం నుండి మంత్రి వెలంప‌ల్లి కూడ ల‌క్కి గా ఛాన్స్ కొట్టేస్తార‌నే ప్ర‌చారం కూడ అంది,అదే జ‌రిగితే ఎడుగురికి మ‌రో సారి క్యాబినేట్ లో ఛాన్స్ లభిస్తుంది..మ‌రి ఈ ప‌రిస్దితులు ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయ‌నేది ,మంత్రి వ‌ర్గంలో తీవ్ర ఆస‌క్తిల కలిగిస్తోంది.  రాష్ట్ర మంత్రివర్గం మార్చి 27న రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జ‌రుగుతున్న జరుగుతోంది.  ఉగాది నాటికి కొత్త క్యాబినెట్ కొలువుదీరనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో  ఆరేడుగురు మాత్రమే కొనసాగే అవకాశమున్నట్లు అంచనా వేయవచ్చు.