ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ ( Jagan Cabinet ) చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ మారబోతున్నారు. హోంమంత్రిగా సుచరితకు కూడా పదవి పోవడం ఖాయమయింది. మరి కొత్త హోంమంత్రి ఎవరన్నదానిపై వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సారి కూడా మహిళా హోంమంత్రే ( Women Home Minister ) వస్తారని.. ఎస్సీ, బీసీ వర్గాల్లో ఒక ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందన్న అభిప్రాయం ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికైతే ఎక్కువగా చర్చల్లో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ( Jonnalagadda Padamavati ) రెండో వారు చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ ( vidadala Rajani ) .
జొన్నలగడ్డ పద్మావతి, విడదల రజనీ ఇద్దరూ తొలి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఒకరు ఎస్సీ ..మరొకరు బీసీ. ఈ విషయంలో వారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుండి ఎన్నికయిన సుచరిత ( Mekathoti Sucharita ) హోం మంత్రిగా పని చేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణ కు అధిక ప్రాదాన్యత ఇస్తూ కొత్త హో మంత్రి పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెదట్లో రోజా పేరు కూడ ప్రచారం జరిగింది. అయితే రోజా దూకుడైన నేత. పైగా రెడ్డి సామాజికవర్గం. ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులు ఒకే సామాజికవర్గానికి ఇవ్వకపోవడం సంప్రదాయంగా వస్తోంది.
దీంతో రోజా పేరు షార్ట్ లిస్ట్ కాలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన పద్మావతి, రజనీలలో ప్రదానంగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు పని చేసిన సుచరిత గుంటూరు జిల్లా నుండి ప్రాతినిద్యం వహిస్తున్నారు. మరలా అదే జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యేకు ప్రాధాన్య. దక్కే అవకాశాలు తక్కువ అంటున్నారు. అయితే ఆమె పార్టికి,జగన్ కు అత్యంత విధేయురాలు,చాలా సైలెంట్ గా పని చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ ఈ సారి రాయలసీమ ప్రాంతానికి హోం మంత్రి పదవిని ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వైఎస్ఆర్‌సీపీలో ప్రస్తుతం మంత్రి పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది. కొత్త మంత్రులు ఎవరన్నదానిపై ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా మాట్లాడుకుంటున్నారు. సీఎం జగన్ ఎలా ఆలోచిస్తారు.. ఏ వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందో అంచనాలు వేసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగే వరకూ అధికార పార్టీలో ఈ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.