ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులందరూ ఈ నెల 27వ తేదీన రాజీనామా చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రులను తీసుకునేందుకు సీఎం జగన్‌కు అవకాశం కల్పిస్తూ వారంతా రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ రెండో తేదీన ఉగాది రోజున సీఎం జగన్ మరోసారి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోజున పర్వదినం కావడం.. కొత్త జిల్లాలు కూడా అదే రోజున ఉనికిలోకి రానుండటంతో..  కొత్త మంత్రివర్గాన్ని కూడా అదే రోజున ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


ఏపీ రాజకీయాలను మార్చనున్న "రోడ్ మ్యాప్" ! బీజేపీ నుంచి పవన్ కోరుతున్నదేంటి ?


నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సీఎం జగన్ కాకుండా ఇరవై ఐదు మంది మంత్రులు ఉండటానికి అవకాశం ఉంది. ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సీఎంతో సహా ఇరవై ఆరు మంది మంత్రులు .. ఇరవై ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేటట్లు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోలా ఈ సారి కూడా ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ, మహిళల కోటా కింద ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తారు. పాత మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 


ఏపీలో కొత్త పార్టీకి రంగం సిద్ధం.. త్వరలోనే దిల్లీలో బ్రదర్ అనిల్ ప్రకటన!


అయితే వంద శాతం మంత్రులను తొలగిస్తారో లేదోస్పష్టత లేదు. సామాజికవర్గాలు...ఇతర కారణాలతో కొంత మందిని కొనసాగిస్తామని సీఎం జగన్ కేబినెట్ భేటీలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వంద శాతం మంత్రుల్ని మార్చేస్తారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలకూడా ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే మార్చి 27వ తేదీన మంత్రులందరి వద్ద  రాజీనామాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత రెండో తేదీన జరిగే మంత్రివర్గ ప్రమణస్వీకారానికి వీరిలో మళ్లీ కొంత మందికి పిలుపు వస్తే సరే.. లేకపోతే అందరికీ పార్టీ పనులు అప్పగిస్తారని అనుకోవచ్చు.


సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే .. రెండున్నరేళ్లకు ఎనభై శాతం మంది మంత్రులను మార్చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ ప్రకారం మార్చాలని అనుకున్నా... వివిధ కారణాలతో ఐదు నెలలు ఆలస్యం అవుతోంది. వచ్చే ఎన్నికల కోసం కొత్త టీంను సీఎంజగన్ రెడీ చేసుకుంటున్నారు. వీరి నాయకత్వంలోనే వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల పోరాటం చేయనుంది.