Azad What next : కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. ఏదైనా ఓ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కడుపులో ఉన్నదంతా రాజకీయ నేతలు బయట పెట్టుకుంటారు. ఆజాద్ కూడా అలాగే పేజీల్లో మొత్తం చెప్పారు. అవన్నీ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా అసంతృప్తి బృందం అయిన జీ-23 చెబుతున్నవే. కొత్తవేం లేవు. అయితే హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చే్శారు ? తరవాతేం చేయబోతున్నారు ? రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా ? అందరూ అంచనా వేస్తున్నట్లుగా బీజేపీలో చేరుతారా ?
కశ్మీర్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని తిరస్కరించిన ఆజాద్
జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించిన తర్వాత లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. జమ్మూ మాత్రం రాష్ట్రంగా ఉంది. అక్కడ ఇటీవల అసెంబ్లీ సీట్ల డీమిలిటేషన్ కూడా పూర్తయింది. ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొనని కమిటీల్ని నియమించారు. అందులో ప్రచార కమిటీ చైర్మన్ పదవి కూడా ఉంది. దాన్ని గులాం నబీ ఆజాద్‌కు కేటాయించారు. అయితే తనకు ఆ పదవి వద్దన్నారు. అప్పుడే ఆయన ఇక పార్టీలో కొనసాగడం కష్టమని అనుకున్నారు. ఆ ప్రకారమే.. ఇప్పుడురాజీనామా లే్ఖ వెలుగులోకి వచచింది.
మోదీతో ఇటీవలి కాలంలో ఆత్మీయ అనుబంధం
గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగుస్తున్న సమయంలో రాజ్యసభలో ప్రధాని మోడీ ఆయన కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఆప్తమిత్రుడని అన్నారు. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. వాళ్ల మధ్య అంత గొప్ప అనుబంధం ఉందని ఇప్పటి వరకూతెలియదే అనుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ సీట్ల భర్తీకి కొన్ని చాన్సులు వచ్చినా ఆజాద్‌కు హైకమాండ్‌కు అవకాశం కల్పించలేదు. అదే సమయంలో బీజేపీ ఆజాద్‌ను రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి బరిలో దింపుతుందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. ఆయితే ఆయన బీజేపీలో చేరడం మాత్రం ఖాయమని భావిస్తున్నారు. కశ్మీర్‌లో బీజేపీ తరపున ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంటున్నారు. అయితే ఆజాద్ దశాబ్దాల క్రితమే ముక్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన కశ్మీర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండకపోవచ్చని అంటున్నారు.
తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని ఢిల్లీలో ప్రచారం !
అయితే బీజేపీతో ముందస్తు అవగాహన ప్రకారమే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా సాగుతోంది ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. పుదుచ్చేరికి ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా పని చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమెను పూర్తిస్థాయిలో పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా అపాయింట్ చేసి.. గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఇదివరకే తమిళిసై సౌందరరాజన్ భేటీ కూడా అయ్యారు. ఆజాద్‌కు.. తెలంగాణతో అనుబంధం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. కొన్నాళ్లు ... తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్ గా కూడా పని చేశారు.
గులాంనబీ ఆజాద్ .. రేపు కాకపోతే.. మరి కొద్ది రోజుల తర్వాతైనా బీజేపీ గూటికి చేరడం ఖాయంగాకనిపిస్తోంది. అదే సమయంలో ఆయనను కీలకంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధపడటం ఖాయం. అందుకే ఆయన ముందు ముందు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.