తెలంగాణ రాజకీయాల్లో కేఏ పాల్ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఆయన రైతులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడి చేశారు. ఆ ఘటన తర్వాత కేఏ పాల్ మరింత దూకుడుగా టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు. తనపై జరిగిన దాడి .. తెలంగాణలో అవినీతిపై ఆయన నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కేఏ పాల్‌కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం... తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది. వివిధ సమస్యలపై ఢిల్లీ వెళ్లిన తమ నేతలకు ఒక్క సారి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడాన్ని గుర్తు తెచ్చుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 


హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్


టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేఏ పాల్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇలా వింతగా ఉందన్నారు. పాల్‌కు ఇచ్చినట్లుగా తమకూ షా అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.  అమిత్ షాను కలిసిన తర్వాత కేఏ పాల్ చేసిన విమర్శలపైనా స్పందించారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని అమిత్ షాకు చెప్పానని కేఏ పాల్ ప్రకటించారు. అయితే ఆయన చెప్పే వరకూ అమిత్ షాకు తెలియదా అని రంజిత్ రెడ్డి లైట్ తీసుకున్నారు. 


అమిత్ షాకు డిఫరెంట్ గా స్వాగతం పలుకుతున్న మంత్రి సబితా రెడ్డి, ఏం ఇవ్వలేదో చెప్పడానికి వస్తున్నారని సెటైర్లు
 


ప్రజలే ఎన్నుకుంటే.. మీకెందుకు బాధ.. బీజేపీ, కాంగ్రెస్ లో కుటుంబ పాలన లేదా.. అని రంజిత్ రెడ్డి ప్రశఅనించారు.  అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అంటున్నారు.. అప్పులు చేసి.. కేసీఅర్ ఇంటికి తీసుకుపోయినట్లు ఆరోపణలు చేస్తున్నారని.. తెలంగాణాలో అత్యధిక వృద్ధిరేటు ఉందని గుర్తు చేశారు. కె.ఏ పాల్ కు అమిత్ షా  అపాయింట్మెంట్ ఇవ్వడం..
చూడ్డానికి చాలా వింతగా అనిపిస్తోందన్నారు. 


48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు - బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్!


కేఏ పాల్‌ను టార్గెట్ చేయడం లేదని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.  పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి అని ప్రశ్నించారు.  పాల్ ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు.  తెలంగాణలో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్న కేఏ పాల్ తన పలుకుబడితో కేంద్ర పెద్దలను కలిసి తెలంగాణ పాలకులపై ఫిర్యాదు చేస్తున్నారు. తనపై జరిగిన దాడినే ఆయన హైలెట్ చేస్తున్నారు. ఆయనకు నేరుగా హోంమంత్రి అపాయింట్‌మెంట్ టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశమవుతోంది. పాల్ రచ్చ వెనుక బీజేపీ ఉందా అని అనుమానిస్తున్నారు.