Nara Lokesh: అమెరికాలో నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత కీలక ప్రకటన చేశారు. రెడ్ బుక్‌లో ధర్డ్ చాప్టర్ అమలు చేయబోతున్నామని చెప్పారు.దీంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొదటి చాప్టర్లు ఏమయ్యాయి .. వాటిలో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారనే. అదే సమయంలో మూడో చాప్టర్‌లో కీలకమైన వ్యక్తులపై చర్యలు ఉంటాయా లేకపోతే అది కూడా మెరుపు తీగలా మాయమైపోయి.. రెడ్ బుక్‌ను అమలు చేసేశామని అంటారా అన్న ఉత్సుకత పార్టీ కార్యకర్తల్లో ఏర్పడుతోంది.
లోకేష్ రెడ్‌బుక్‌పై పార్టీ కార్యకర్తల్లో ఎన్నో అంచనాలు
ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నోటి వెంట రెడ్ బుక్ అనే మాట ఖచ్చితంగా వచ్చేది. తప్పు చేసిన ప్రతి ఒక్కడి పేరును అందులో నమోదు చేస్తున్నామని తాము రాగానే వేటాడి వెంటాడుతామని చెప్పేవారు. పాదయాత్ర ముగింపు సభలో ఆ రెడ్ బుక్‌ను చూపించారు కూడా. అందులో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ అధినేతను ఇబ్బంది పెట్టిన వారందరి పేర్లు ఉంటాయన అందరూ అనుకున్నారు. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో లోకేష్ బయట పెట్టలేదు. కానీ ఆ రెడ్ బుక్‌కు ఓ ఇమేజ్ వచ్చింది. ప్రతీకారంతో రగిలిపోయే టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపింది.
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిదానమే ప్రధానం !
టీడీపీ గెలిచిన వెంటనే నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసి.. ప్రతి ఒక్కరి తాట తీస్తారని కార్యకర్తలు అనుకున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండేవంటే.. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలను.. నేతల్ని కేసులు పెట్టి ఎలా వేధించారో.. స్టేషన్లకు తీసుకెళ్లి ఎలా ధర్డ్ డిగ్రీ ప్రయోగించారో వాటికి బాధ్యులైన వారందరికీ అలాంటిది రెట్టింపు చూపిస్తారని అనుకున్నారు. కానీ అధికారం అందిన తర్వాత రెడ్ బుక్ అమలు చట్టబద్దంగా ఉంటుందని ప్రకటించారు. ఓ వైపు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ విమర్శలు చేస్తోంది. మరో అసలు రెడ్ అమలే చేయడం లేదని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఓ సందర్భంలో లోకేష్ రెడ్ బుక్ అమలు ప్రారంభమయిందని చెప్పారు .ఇప్పుడు అది మూడో దశకు చేరిందని అంటున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లోనే అయోమయం ఏర్పడింది.
ఉద్యోగం పేరుతో రూ.90 లక్షలు మోసం చేసిన మాజీ మంత్రి - మెరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు !
మూడో ఫేజ్‌లో అయినా కఠిన చర్యలు కోరుకుంటున్న క్యాడర్
రెండు ఫేజ్‌లలో ఏం చేశారో లోకేష్ చెప్పలేదు. కానీ వైసీపీ హయాంలో రూల్స్ ఉల్లంఘించిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం ఒక్కటే కళ్ల ముందు కనిపిస్తోంది. తమపై వేధింపులకు పాల్పడిన ఎవరిపై చర్యలు లేవు. నిబంధనలు ఉల్లంఘించి ఊరూవాడా ప్రెస్‌మీట్లు పెట్టిన సీఐడీ చీఫ్ సంజయ్ పై కూడా ఇప్పటి వరకూ ఈగ వాలలేదని.. చంద్రబాబు కుటుంబసభ్యుల డాక్యమెంట్స్ కూడా అక్రమంగాసేకరించి స్వయంగా నారా లోకేష్, బ్రహ్మణిని, భువనేశ్వరిని కూడా అరెస్టు చేసేందుకు కుట్ర చేసిన రఘురామిరెడ్డి, పీఎస్ఆర్ సీతారామాంజనేయులు వంటి వారిపైనా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇలాంటి అసంతృప్తి టీడీపీ కార్యకర్తల్లో ఎక్కువగానే ఉంది. రెడ్ బుక్ విషయంలో నారా లోకేష్ వారి అంచనాలను ఇప్పటి వరకూ అందుకోలేదు. మరి మూడో చాప్టర్లో అయినా అందుకుంటారా?