అనంతపురం జిల్లా  ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు రాజకీయ ఉద్యమాలకు కారణం అవుతోంది. రెవిన్యూ డివిజన్‌ను పునరుద్ధరించాలంటూ టీడీసీ నియోజకరవగ్ ఇంచార్జ్  పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల విభజన కారణంగా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓ వైపు హిందపురం జిల్లా కోసం ఉద్యమాలు జరుగుతూండగా.. ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ను రద్దు చేయడంపై  పరిటాల శ్రీరాం ఆందోళనలు చేస్తున్నారు.


మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి కూడా అనంతపురంలో కలెక్టర్ ను కలిసి ధర్మవరంలోనే రెవిన్యూ డివిజన్ కేంద్రం వుండేలా చూడాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే ధర్మవరంలో మూడు ముక్కలాటగా మారిన రాజకీయాలు తాజా సంఘటనతో కూడా అదే వైఖరి కంటిన్యూ అవూతూ వస్తోంది. ఓ వైపు ధర్మవరంలో పరిటాల శ్రీరాం మౌనదీక్ష చేస్తూం మరోవైపు అనంతపురంలో కలెక్టర్ ను కలిసి ఈ సమస్యపై తామంటే తాము పోరాటం చేస్తున్నామన్న సంకేతాలను ఇతర పార్టీల నేతలు ప్రజల్లోకి పంపిస్తున్నారు.  


టీడీపీ ఇంచార్జ్‌గా పరిటాల శ్రీరామ్, బీజేపీ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతలకు ఉన్నంత వెసులుబాటు ఎమ్మెల్యే కేతిరెడ్డికి లేదు. ఆయన ధర్నాలు, ఆందోళనలు చేయలేరు. అందుకే కలెక్టర్ ద్వారా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఖచ్చితంగా రెవిన్యూ డివిజన్ తరలి పోకుండా చూడాలని ప్రజలు కూడా ఆశిస్తున్నారు.  మరో వైపు ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. నూతనంగా ఏర్పాటు అవుతున్న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో కచ్చితంగా రెవిన్యూ డివిజన్ కేంద్రం వుండాలి కాబట్టి ధర్మవరం నుంచి మార్చాల్సి వస్తందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. .ఇప్పటికే అదికారులకు ఆదేశాలు కూడా అందాయి. 


నూతన జిల్లా కేంద్రం విషయంలో .. ధర్మవరం రెవిన్యూ డివిజన్ కేంద్రం విషయంలో రాజకీయ లబ్ది కోసమే ఇతరులు ఆందోళనలు చేస్తున్నారని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేతలకు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్  సూచించినట్లుగా తెలుస్తోంది.రాజకీయంగా తిప్పికొట్టేందుకు స్థానికంగా కార్యక్రమాలు చేసుకోండి తప్పితే వాటిని సీరియస్ గా తీసుకోవద్దని సూచనలు పంపారు. కదిరిలో కూడా ఇదే ఇష్యూ ప్రారంభం అయినప్పటికీ ప్రభుత్వం అక్కడి కార్యాలయాన్ని తరలించడం లేదంటూ ప్రకటించింది.దీంతో సత్యసాయి జిల్లా ఏర్పాటు విషయంలోగ హిందూపురం, ధర్మవరం ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఎంత వరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి...!