Andhra Pradesh And Telangana Hopes On Central Interim Budget 2024: నేడు పార్లమెంట్ ముందుకు రానున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై తెలుగు రాష్ట్రాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో కేంద్రం వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌లతోపాటు, నిధులు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నాయి. అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్‌ కాకపోవడంతో నిర్మలా సీతారామన్ ఏ మేరకు తెలుగు రాష్ట్రాలపై దయచూపుతుందో అర్థంకావడం లేదని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.



రేవంత్‌ కోర్కెలు ఫలించేనా
తెలంగాణలో కాంగ్రెస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా..ఏమాత్రం భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ప్రధాని నరేంద్రమోడీ(Narendra ModI)ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల గురించి విన్నవించారు. పలువురు కేంద్రమంత్రులను సైతం కలిసి పెండింగ్ పనులను గుర్తుచేశారు. వీటిలో కొన్నింటికి గత బడ్జెట్‌లో కేంద్రం నిధులేమీ కేటాయించనందున కొత్త బడ్జెట్‌లోనైనా చోటు దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం( Tg Govt) ఆశిస్తోంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని, అలాగే హైదరాబాద్‌ - నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వీటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌(Hyd)లో మెట్రో విస్తరణ పనులు చేపట్టాలని కాంగ్రెస్(Cong) ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సైతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. వీటితోపాటు రాష్ట్రానికి చాలాకాలంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద నిధులు రావడం లేదు. సుమారు .1,800 కోట్లు గ్రాంటుగా రావాల్సి ఉన్నందున వీటిన్నింటిపైనా సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క(Mallu Batti Vikramarka) కేంద్రం పెద్దలను కలిసి విన్నపించారు. ఈ బడ్జెట్‌లో వీటికి మోక్షం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఏపీ ఎదురుచూపులు
విశాఖ(Vizag) ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యమం నడిచింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం దీనిపై పునరాలోచన చేస్తుందేమోనని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే పోర్టుల అభివృద్ధిలో వేగం పెంచడంతోపాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వాటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిపై ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకుంటురో చూడాలి.


భోగాపురం(Bhogapuram) విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయడంతోపాటు, సెంట్రల్‌ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీకి నిధులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రంలోనూ ఐఐఎంఆర్(I.I.M.R) తరహాలో వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని గతంలో సీఎం జగన్(Ap Cm Jagan) కేంద్ర పెద్దలను కలిసిన సందర్భంగా పలుమార్లు విన్నవించారు. దీనికి ఈ బడ్జెట్‌లోనైనా మోక్షం కలుగుతుందేమో చూడాలి. ఇక ఏపీకి గుండెకాయలాంటి పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయింపుపైనా బడ్జెట్‌ లో నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి..

పాలమూరుకు పచ్చజెండా ఊపేనా..?
పోలవరం( Polavaram) ప్రాజెక్ట్‌ మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్రమే నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే జాతీయ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు కేంద్రం స్వస్తి పలికిన నేపథ్యంలో కేంద్రం మరో విధంగానైనా సాయం చేస్తుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే విభజన చట్టంలో తెలిపిన గిరిజన యూనివర్సిటీ, ఉద్యాన వర్సిటీలకు నిధులు రావాల్సి ఉంది. ఇదే చట్టం కింద తెలంగాణ( Telangana)కు 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,600 మెగావాట్లు ఇప్పటికే కేంద్రం నిర్మించింది. మిగిలిన వాటి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో ప్రస్తావించొచ్చని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సింగరేటి, ఐఐటీ హైదరాబాద్‌( IIT Hyderabad), మణుగూరు కోట భారజల కర్మాగారానికి కేంద్రం కేటాయింపులు పెంచాల్సి ఉంది....


విభజన హామీలు అమలయ్యేనా...
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం రెండు రాష్ట్రాలకు చాలా హామీలు ఇచ్చింది. పదేళ్లయినా ఇప్పటికీ హామీలు పూర్తిస్థాయి అమలు కాలేదు. ఎన్నికల వేళ ఇప్పటికైనా వాటికి మోక్షం లభిస్తుందేమోనని రెండు రాష్టాలు ఎదురు చూస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మంగళగిరి(Mangalagiri), బీబీనగర్‌( BB Nagar) ఎయిమ్స్‌ ఆసుపత్రులకు నిధులు కేటాయించాల్సి ఉంది. ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపులు చేయాల్సి ఉంది.