TS Social Media War : తెలంగాణలో రాజకీయ వేడెక్కింది. నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి ఓ వైపు అన్ని పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యుద్ధం చేసేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మీరేం చేయలేదంటే.. మీరు ఏం చేయలేదని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఒకరి వైఫల్యాల్ని ఒకరు బయట పెడుతున్నారు. దీనంతిటికి కారణం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతూండటమే. జరుగుతోంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలే అయినా బీజేప .. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి దీన్నో వేదికగా మల్చుకుంది. సోషళ్ మీడియాలో పాలనా వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ  పోస్టులు హోరెత్తిస్తున్నారు.





 కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా  కేంద్రం పాలనా వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. 





అదే సమయంలో తెలంగాణ సోషల్ మీడియా సాధించిన అభివృద్ధిని తెలిపేందుకు ప్రత్యేకంగా ట్రెండింగ్ చేయాలని కూడా ప్రయత్నిస్తోంది. రోజుకో టాపిక్‌పై ఇలా ట్రెండింగ్ చేసే చాన్స్ ఉంది. తాజాగా  #TelanganaThePowerhouse హాష్ ట్యాగ్ ద్వారా పోస్టులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అగ్రికల్చర్ నుండి ఐటీ వరకు, విద్యుత్ నుండి పరిశ్రమల వరకు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో విజయ వంతంగా అమలవుతున్నాయని ఈ ట్రెండింగ్ ద్వారా తెలియ చేస్తున్నారు. 






ఈ సోషల్ మీడియా వార్‌లోకి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలని మోదీన డిమాండ్ చేస్తూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తోంది. [