Telangana Congress :    తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముందు ముందు చేరికల జోష్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీలో చేరుతామని టిక్కెట్లు కేటాయించాలని ఇద్దరు మాజీ ఎంపీలు  ఆ పార్టీని సంప్రదించినట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జన్ ఖర్గే దగ్గర ఉందని..ఆయన ఆమోద ముద్ర వేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంటున్నారు. నిజానికి ఆ ఇద్దరు ఎంపీలు స్వతహాగా బీజేపీ నేతలు కారు. పార్టీలు మారి బీజేపీలోకి వచ్చారు.  బీఆర్ఎస్ పార్టీని బీజేపీ గట్టిగా టార్గెట్ చేస్తుందని..గెలిచే పార్టీ అనే నమ్మకంతో చేరారు. ఇప్పుడా నమ్మకం చెదిరిపోవడంతో  వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటన్నారు. 


ఎంత మంది వీలైనంత అంత మందిని కాంగ్రెస్ లోకి తెచ్చే ప్రయత్నంలో రేవంత్


టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. ఎవరు పార్టీలోకి వస్తామన్నా తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్లలో నేరుగా పేర్లు పెట్టి మరీ పిలుస్తున్నారు. అయితే పార్టీలో చేర్చుకోవడం వరకూ ఓకే కానీ వారికి టిక్కెట్లు కేటాయించే అంశంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వలేకపోతున్నారు. టిక్కెట్ల కేటాయింపు ఆయన చేతుల్లో ఉండదు. అందుకే ఆయన పిలుపులకు స్పందించేవారు.. తెర వెనుక చర్చలు జరుపుతున్నారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో హామీ ఇస్తే..  పార్టీ కండువా కప్పుకుంటామని అంటున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 


బలమైన నేతలకు హామీ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ                      


ఖచ్చితంగా అభ్యర్థిత్వం ఇవ్వాల్సిందే అనుకున్ నేతలు వస్తామంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఆలోచించదని అంటున్నారు. ఎంపీ టిక్కెట్ మీద పోటీ చేయాలంటే..ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి నేతలకుట టిక్కెట్లు ఇచ్చేందుకు రెడీగానే ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటీవల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మందితో చర్చలు జరుపుతున్నారు. అయితే వెల్లువలా చేరికలు అనే ఫీలింగ్ కల్పించడానికి వ్యూహాత్మకంగా చేరికలను ఆలస్యం చేస్తోంది. త్వరలో చేరిక మారథాన్ ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలంటున్నారు. 


జూపల్లి, పొంగులేటి కూడా కాంగ్రెస్ లోకేనా ?                               


బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నా..  ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడినందున అలాంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందలు ఎదురవుతాయన్న అంచనాల్లో వారు ఉన్నారంటున్నారు. త్వరలో వీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.  బీఆర్ఎస్ పార్టీ లో టిక్కెెట్లు ఖరారైన తర్వాత కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది.