Telangana Elections 2023 candidates Affidavits : ఎన్నికల్లో ఈ సారి అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టిన అంశం అఫిడవిట్లు. అఫిడవిట్లలో తప్పులు దొర్లాయని గెలిచిన తర్వాత అనర్హతా వేటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. అందుకే.. అఫిడవిట్లను చాలా సీరియస్ గా ప్రిపేర్ చేసుకున్నారు. వారి అఫిడవిట్లను ప్రత్యర్థులు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసవారు కాదు. కానీ కోర్టుల్లో అనర్హతా వేటు ప్రకటించి .. తరువాతి స్థానంలో ఉన్న వారిని విజేతగా ప్రకటిస్తూండటంతో ఆ అవకాశాన్నీ రాజకీయ నేతలు వదులు కోవడం లేదు.
ప్రత్యర్థుల అఫిడవిట్లను పరిశీలిస్తున్న నేతలు
ప్రత్యర్థులు నామినేషన్ ( Nomination ) పత్రాలల్లో పేర్కొన ఆస్తులు, కేసుల వివరాలను సేకరిస్తూ వాటిపై ఆరా తీస్తున్న నేతల సంఖఏ్య ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే గెలుపోందిన అభ్యర్థి పై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అంటూ న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచిన అభ్యర్థి అక్రమ మార్గంలో విజయం సాధించాడని ప్రచారం చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే ఇతరులకు అలాంటి అవకాశాలు ఇవ్వకూడదని అఫిడవిట్లపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి న్యాయనిపుణుల సాయంతో అఫిడవిట్లు ప్రిపేర్ చేసుకున్నారు.
గతంలో 16 మందిపై కోర్టుల్లో పిటిషన్లు
గత ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యతో ఎన్నికల రద్దయ్యే పరిస్థితి వచ్చింది. కొంత మందికి హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పదవి కోల్పోతే సుప్రీంకరోర్టుకు ( Supreme Court ) వెళ్లి మధ్యంతర స్టే తెచ్చుకుని తీర్పును వాయిదా వేయించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, బిఎస్పీలకు చెందిన అభ్యర్థుల వివరాలను ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రత్యేక ఆడిటర్, న్యాయవాదిని ఏర్పాటు చేసుకుని ఆఫిడవిట్ వివరాలు తీసుకుని అవి మేరకు సరిగ్గ ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తూ లోపాలు గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల కంటే ముందు టికెట్లు ప్రకటించిన గులాబీ బాసు, సిఎం కెసిఆర్ భిపామ్‌లు అందజేసే సమయంలో నామినేషన్లు పత్రాలల్లో తప్పుడు వివరాలు నమోదు చేయకుండా సక్రమంగా భర్తీ చేసి ప్రత్యర్థులకు దొరకకుండా జాగ్రత్తలు పాటించాలని అభ్యర్థులకు సూచించారు. పార్టీ తరపున నిపుణులను అందుబాటులో ఉంచారు.
అఫిడవిట్లలో తప్పులు కోర్టుల్లోనే తేలాలి ! !
అతర పార్టీలు కూడా ఏ ఫామ్, బిఫామ్‌లు ఇచ్చి నామినేషన్ల పత్రాలు సక్రమంగా నింపాలని, ఆఫిడవిట్‌లో తప్పులు లేకుండా చూసుకోవాలని అజాగ్రత్తంగా ఉంటే విజయం సాధించిన తరువాత కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముందని అభ్యర్థులను హెచ్చరించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎఐసిసి నాయకులు, రాష్ట్ర ఇంచార్జీలు కూడా భిపామ్ అభ్యర్థులకు అందజేసేటప్పుడు నామినేషన్ల విషయంలో నిర్లక్షం వహించకుండా ఒకటి రెండుసార్లు పరిశీలన చేసి ఆస్తులు, కేసులు వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలని పేర్కొన్నట్లు ఆపార్టీకి చెందిన అభ్యర్థులు వెల్లడించారు. దీంతో వారంతా ముందుగా ఆడిటర్, న్యాయవాదితో నామినేషన్ పత్రాలు నింపి ఎన్నికల అధికారులు సమర్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే నాయకుల ఆఫిడవిట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవడంపై ఎన్నికల అధికారులు సైతం కొత్త ట్రెండ్ ప్రారంభమయిందని ఆశ్చర్యం వ్యక్తం చే్తున్నారు.