Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల హడావుడి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం పన్నెండు మంది మాత్రమే ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తరవాత విస్తరణ చేపట్టాలని అనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో విస్తరణపై దృష్టి పెట్టారు.  ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపారని     గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  


అసెంబ్లీ సమావేశం కంటే ముందే  మంత్రివర్గ విస్తరణ                        


అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే విస్తరణ ఉండే అవకాశం ఉంది.  రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటు లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలెవ్వరూ లేరు. ఎమ్మెల్యేలు గెలవకపోవడమే దీనికి కారణం.  ఈసారి ఆయా జిల్లాలకు ఛాన్స్ ఇవ్వాలని అనకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముదిరాజ్‌లకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు.  వారిలో ముక్తల్ నుంచి శ్రీహరికి రావచ్చని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్, సుదర్శన్‌రెడ్డి, మైనార్టీల నుంచి ఒకరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచాలని రేవంత్ అనుకుంటున్నారు. 


బీఆర్ఎస్‌‌లో పార్టీ ఫిరాయింపుల అలజడి- ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఆకర్ష్


మంత్రి పదవుల కోసం భారీ పోటీ                        


పలువురు నేతలు మంత్రి వర్గంలో స్థానంలో కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. మరో వైపు పార్టీలో చేరిన వారికీ చాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా విజయం సాధించలేదు. దీంతో పార్టీలో చేరిన వారికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేను మరో పార్టీ ప్రభుత్వంలో  ప్రమాణం చేయించేందుకు గవర్నర్ అంగీకరిస్తారా అన్న సందేహాలు ఉన్నాయి. 


16 సీట్లతో టీడీపీ సాధించింది - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు


స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు                      


స్థానిక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ  బడ్జెట్ తర్వాత నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలనలో స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తి చేస్తే ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే మంత్రి పదవుల భర్తీ పెను సవాల్ గా మారనుంది. సీనియర్లు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.