Kovvur Urban Bank Election : హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇలా అయింది వైఎస్ఆర్‌సీపీకి చెందిన అభ్యర్థులకు కాదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి. ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉండటంతో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అర్బన్ బ్యాంక్ పాలకమండలిలో మరోసారి తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు ఆధిపత్యం ప్రదర్శించారు. వైఎస్ఆర్‌సీపీ పట్టించుకపోతే ఈ ఎన్నిక గురించి ఎవరూ చెప్పుకునేవారు కాదు కానీ.. హోంమంత్రి తానేటి వనిత.. ఆ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులను నిలబెట్టి గెలిపించాలనుకున్నారు.
పశువులకే నోరుంటే మా పాలనను మెచ్చుకునేవి - సీఎం జగన్ వ్యాఖ్యలు
వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా అర్బన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో హోంమంత్రి తానేటి వనితకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఆ ప్రకారం పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులే గెలవాలని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించిన వ్యవహారం ఇంకా కిళ్ల ముందుఉన్నందున కొవ్వూరులోనూ ఆ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు.
ఇతర రాష్ట్రాల కన్నా అప్పులు తక్కువే - ఏపీపై ఎక్కువ ప్రచారం జరుగుతోందన్న ఆర్థిక మంత్రి బుగ్గన !
అయితే హోంమంత్రిఅనుకున్నట్లుగా జరగలేదు. కనీసం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలబడలేదు. మొత్తం అర్బన్ బ్యాంక్‌లో 11 డైరక్టర్ స్థానాలు ఉంటే అన్ని స్థానాలూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకుడు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ ను డైరెక్టర్లు అందరూ కలిసి ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. మద్దిపట్ల శివరామకృష్ణ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అవడం ఐదో సారి.
దేశానికి కోటిన్నర కోట్ల అప్పు ! రాష్ట్రాలకు సుద్దులు చెప్పి కేంద్రం చేస్తున్నదేంటి ?
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో షాక్ తగిలిన అంశంపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా ఆరా తీసింది. టీడీపీ నాయకుల వ్యూహాలను ఛేదించడంలో హోంమంత్రి వనిత గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు ఏకగ్రీవం అయినందున.. చెల్లదని చెప్పి త్రీమాన్ కమిటీ ద్వారా ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారంజరుగుతోంది. ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కనీసం పోటీలో అభ్యర్థులను నిలబెట్టకపోవడంపై హోంమంత్రి వనిత వైఫల్యంం ఉందని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.