TDP Anita :  ఇంటర్మీడియట్ విద్యార్థులు లక్షల్లో ఫెయిల్ కావడం ఎప్పుడూ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. విద్యార్థుల సప్లిమెంటరీ ఫీజులతో అమ్మఒడి కట్టే ఆలోచన చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల వద్ద ఎలాంటి ఫీజులు తీసుకోకుండా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల టెన్త్ పరీక్షల్లోనూ రెండు లక్షల మందికిపైగా తప్పాలని..ఇప్పుడు ఇంటర్ మొదటి, రెండో ఏడాది కలిపి మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. ఇలాఎప్పుడూ జరగలేదని స్పష్టం చేశాు.  ఇంటర్ విద్యార్థులు సప్లిమెంటర్ ఫిజులుతో అమ్మ ఓడి పధకం డబులు వచ్చేస్తాయాని ఆలోచిస్తున్నట్లుగా న్నారని..  పేదలకు ఇచ్చే పధకాలు డబ్బులు, ప్రజల నుంచే లాకొంటున్నారని మండిపడ్డారు. 


పవన్ పిలుపు కోసం పృధ్వీ వెయిటింగ్ - జగన్ పిలిచినా వెళ్లనంటున్న కమెడియన్ !
 
మాట తప్పును మడమ తిప్పను అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరి మహిళలు పింఛన్ విషయంలో, అన్యాయం చేశారని.. ఒంటరి మహిళలు పెన్షన్ విషయంలో వయో పరిమితి పెంచి కొత పెట్టారని విమర్శించారు. అందరికీ సంక్షేమ పధకాలు అని చెప్పి కోతలు పెడుతున్నారని.. ఇప్పుడు దుల్హన్ పధకాన్ని కూడా ఎగ్గొట్టారని విమర్శించారు.  పేద ముస్లిం కుటుంబాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే వైఎస్ఆర్ కానుక  కింద లక్ష ఇస్తాను అని జగన్ ఓట్లు పొందారని..  ఇప్పుడు మాట మార్చి ముస్లిం మహిళలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు..దుల్హన్ కింద 50 వేలు ఇచ్చే వారని.. ఇప్పుడు ఆ పధకం తీసేశారని గుర్తు చేశారు. 


డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ రెండు వర్గాలకేనా ? మిగతా వాళ్లేం పాపం చేశారంటున్న బీజేపీ !


అమ్మఒడి కూడా కోతలు పెట్టి లక్షల్లో లబ్ది దారులను తొలగించారని అనిత మండిపడ్డారు.  సీఎం జగన్ చుట్టూ ఉండే అధికారులు మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు.  ఎంత మంది మహిళలు బాధ పేడుతున్నారో సీఎం జగన్ జనం లోకి వచ్చి చూస్తే అర్ధం అవుతుందన్నారు. అమ్మఒడి లేకపోతే, ఆ అమ్మ ఎలా భాదపడుతుందో.. విద్యా దీవెన లేకపోతే ఆ విద్యార్థి ఎలా బాధ పడుతున్నాడో సీఎం తెలుసుకోవాలని అనిత సూచించారు.   ఒంటరి మహిళల ఉసురు పోసుకోకూడదు...పధకాల్లో  కోతలు పెట్టి మహిళలకు అన్యాయం చేయకూడదని హితవు పలికారు. 


ఐపీఎస్ మణికంఠకు చట్టాలు తెలియదా ? - రూల్స్ పాటించని అధికారులను వదిలే ప్రసక్తే లేదన్న అచ్చెన్న !