BJP Vishnu On AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ముస్లిం, క్రిస్టియన్ల కోసం పని చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ.. డర్టీ పాలిటిక్స్ చేస్తోందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిందిని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ తీసుకునేందుకు యువతను ఆహ్వానిస్తూ ఆ ప్రకటన విడుదల చేశారని.. అందులో ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లకు మాత్రమే అని పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ అంశాన్ని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆ రెండు కమ్యూనిటీస్‌కే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
ఐపీఎస్ మణికంఠకు చట్టాలు తెలియదా ? - రూల్స్ పాటించని అధికారులను వదిలే ప్రసక్తే లేదన్న అచ్చెన్న !
భారతీయ జనతా పార్టీ విద్యను అందించడానికి కానీ యువతకు ఉపాధి కల్పించాడనికి కూడా వ్యతిరేకం కాదని కానీ కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసి కొన్ని వర్గాలను ప్రోత్సహించడానికి మాత్రం వ్యతిరేకమని విష్ణువర్దన్ రెడ్డి అంటున్నారు.
పవన్ పిలుపు కోసం ఫృధ్వీ వెయిటింగ్ - జగన్ పిలిచినా వెళ్లనంటున్న కమెడియన్ !
విష్ణువర్దన్ రెడ్డి చేసిన ట్వీట్.. . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ శాఖ జారీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అందరికీ సమాన అవకాశాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని.. నెటిజన్లుఅంటున్నారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ ప్రకటన ప్రభుత్వానిదేనా లేకపోతే.. ఇతర స్వచ్చంద సంస్థలు ఏమైనా ఇచ్చాయా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.