Political Reactions On Zoom Meeting :  ఫెయిలయిన టెన్త్ విద్యార్థులు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో టీడీపీ నేత నారా లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి వైఎస్ఆర్‌సీపీ నేతలు రావడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇరవై, ముఫ్పై ఏళ్ల కింద పదో తరగతి పదో తరగతి ఫెయిలయిన వాళ్ల కోసం త్వరలోనే జూమ్ మీటింగ్ పెడతామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. 





ప్రభుత్వం చేసిన తప్పిదాలు, పాలకుల అసమర్థతల ఫలితంగా పదో తరగతి తప్పిన  పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ చిన్నారులను నిర్జీవులుగా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ స్థితిలో వెకిలి చేష్టలకు దిగిన వైఎస్ఆర్‌సీపీ నేతలను ఏమనాలని  తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది., 


 





 జూమ్ కాల్‌లోని వీడియో క్లిప్‌లను రెండు పార్టీల నేతలు వైరల్ చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆన్‌లైన్‌లోకి రాగానే లోకేష్ కాల్ కట్ చేశారని ప్రచారం జరిగింది. అయితే కాల్ కంటిన్యూ చేశారని.. వాళ్లే వెళ్లిపోయారని టీడీపీ నేతలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 





 జూమ్ కాల్ ఇష్యూ తర్వాత మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. విద్యార్థులను నారా లోకేష్ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. 


 





 జూమ్ కాల్ వ్యవహారం రెండు పార్టీల మధ్య మరోసారి తీవ్ర వాదోపవాదాలకు కారణం అవుతోంది. ఫేక్ పార్టీ..ఫేక్ ఐడీలతో తమ మీటింగ్‌లో చొరబడిందని.. ఇదేం పద్దతని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.