Vishal No Politics :  తమిళంలో హీరోగా నిలదొక్కుకున్న తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారని.. కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని విశాల్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని.. అయినా ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదన్నారు. తన ప్రాధాన్యం ఇప్పుడు సినిమాలకు మాత్రమే నని.. ఏపీ రాజకీయాల్లోకి వచ్చి.. చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. 






నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !


చంద్రబాబును ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ఆర్‌సీపీ   స్టార్ ఇమేజ్ ఉన్న వారిని తీసుకు రావాలని  కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది.  తమిళ హీరో విశాల్ రెడ్డిని ఇందు కోసం సంప్రదించారని వైఎస్ఆర్‌సీపీలోని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నెల్లూరుకు చెందిన విశాల్ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడింది.  ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. విశాల్ రెడ్డికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాకపోతే ఆయన తమిళ రాజకీయాల్లో ఉన్నారు. ఓ సందర్భంలో అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాల్లో భాగమయ్యారు. 


ఉడుతకు పోస్టుమార్టం - సజీవ దహనం ప్రమాదానికి కారణం తేల్చే పనిలో అధికారులు !


శశికళ జైలుకెళ్లిన తర్వాత జయలలిత నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీటీడీ దినకరన్‌పై ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. నామినేషన్ పత్రాలతో వెళ్లినా చివరికి వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టారు.. ప్రస్తుతం కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు. ఇప్పుడు చంద్రమౌళి చనిపోయారు.  చిత్తూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చంద్రబాబును‌ ఓడిస్తామని‌ గట్టిగానే సవాల్ విసురుతున్నారు. ఆయన కూడా తమ అభ్యర్థి విశాల్ కాదని ప్రకటించారు.  
 
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ విజయాలన్నింటి వెనుక పెద్దిరెడ్డి వ్యూహమే ఉంది. ఆయనే దగ్గరుండి విజయానికి బాటలు వేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడాన్ని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన కూడా విశాల్ అభ్యర్థి కాదని ప్రకటించారు. అదే సమయంలో విశాల్ కూడా ఖండించారు. దీంతో ఈ ప్రచారానికి చెక్ పడినట్లయింది.