Divyavani Meet Chandrababu : పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తనకు వచ్చిన ఓ ట్వీట్‌ను చూసి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించానని .. పొరపాటు జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి క్లారిటీ ఇచ్చారు. ఆమె సోమవారం రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్లు చేసి.. తర్వాత తీసేశారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.
బూతుల వాగ్దాటే రాజకీయ భవిష్యత్‌కు ఆధారం - మారిపోతున్న రాజకీయ విలువలు !
ఫేక్ ప్రచారాలకు తొందరపడొద్దని దివ్యవాణికి చంద్రబాబు సలహా
పార్టీకి రాజీనామా చేశానని ట్వీట్ చేసిన తర్వాత తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని దివ్యవాణి వ్యాఖ్యానించారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికీ కృతజ్ఞతలని దివ్యవాణి వ్యంగంగా వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్టు చూసి పొరపడి ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు. ఫేక్ ప్రచారాలకు తొందరపడొద్దని చంద్రబాబు సూచించారన్నారు.
కార్యకర్తలపై అక్రమ కేసులు - అత్యవసరంగా జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన పవన్ !
యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూతో వివాదం
మహానాడులో తనకు అవమానం జరిగిందని ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యవాణి ఆరోపణలు చేశారు. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నానని ఆరోపించారు. కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో ఈ వ్యవహారం కలకలం రేపింది. హఠాత్తుగా సోమవారం ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ప్రకటించారు. తర్వాత ట్వీట్ డిలీట్ చేశారు.
నిపుణులతోపాటు అందరం తలలు బద్దలకొట్టుకుంటున్నాం- పోలవరంపై అంబటి కామెంట్
వివాదం సద్దుమణిగిందంటున్న టీడీపీ
అయితే ఆమె తనను సస్పెండ్ చేశారనుకుని ఆ ట్వీట్ చేశారు. ఇతర టీడీపీ నేతలు ఆమెతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు కావాలని ఫేక్ ట్వీట్లు క్రియేట్ చేశారని.. దివ్యవాణిపై టీడీపీ ఎలాంటి సస్పెన్షన్ వేటు వేయలేదని చెప్పారు. దీంతో దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఉన్న ట్వీట్‌ను తొలగించారు. దీంతో దివ్యవాణి వివాదం టీడీపీలో సమసి పోయినట్లుగా భావిస్తున్నారు.