డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న కారణంగానే పోలవరం లేట్ అవుతుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. దీని కారణంగా కాఫర్ డ్యాం పాడైందన్నారు. దీనిపైనే భారత్‌ దేశంలోని నిపుణులు తలలు పగలగొట్టుకుంటున్నారని కామెంటే చేశారు. కాఫర్ డ్యాంప్ పూర్తిగా పాడైందన్న అంబటి.. అక్కడ పెద్ద అగాతం ఏర్పడిందన్నారు. దీన్ని పూర్తి చేయాంటే డయాఫ్రమ్ వాల్ కట్టాలని వివరించారు. ఈ ప్రక్రియ పద్దతి సాగుతుందన్నారు. 


ఈ సీజన్ వర్షాలు వచ్చేలోపు లోయర్ కాఫర్ డ్యాం పూర్తి చేసేందుకు అంతా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు మంత్రి అంబటి రాంబాబు. దీన్ని పూర్తి చేసిన తర్వాత డయాఫ్రం వాల్‌ను రిపేర్‌ చేయాలన్నారు. దీనపైనే చాలా కన్ఫ్యూజన్ ఉందన్న అంబటి... ఉన్నదాన్ని రిపేర్ చేయాలా... కొత్తది నిర్మించాలా అనేది ఇప్పటికైతే స్పష్టత లేదంటున్నారాయన. ఈ అంశంపైనే భారత్‌లో ఉన్న జలవనరుల నిపుణులంతా తలలు పగలగొట్టుకుంటున్నారని. డయా ఫ్రమ్ వాల్ పాడైందా లేదా అన్నదానిపై చర్చ నడుస్తోందన్నారు. 


డయఫ్రమ్‌ వాల్ దెబ్బతినడం చాలా ప్రమాదకర సంకేతమని అభిప్రాయపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. దీని వల్లే ప్రాజెక్టు డిలే అవుతుందన్నారు. పోలవరం పూర్తి చేయడానికి ఎలాంటి గడువులు లేవు. దశల వారీగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటి దశ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు చేస్తున్నామన్నారు అంబటి.  


గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్న అంబటి రాంబాబు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. ఎవరి కారణంగా డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందో ఇంజినీర్లు, మేధావులు, మీడియా చర్చించాలని సూచించారు. దీనికి  చంద్రబాబు, దేవినేని ఉమ రావాలని సవాల్ చేశారు.