Political Dirty language : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాష రాను రాను దిగజారిపతోంది. గతంలో అడ్డదిడ్డంగా మాట్లాడే నాయకులు సైతం సభలలో మాట్లాడే సమయంలో సభా మర్యాదలు పాటిస్తు గౌరవంగా ప్రసంగించే వారు. సామాన్యులు సభకు వెళితే నాలుగు మంచి మాటలు నేర్చుకొనేవారు. భాషలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించే వారు. ఇప్పటి పరిస్తుతులు అందుతకు బిన్నంగా తయారయ్యాయి. రాజకీయ నాయకులు సభలో మాట్లాడుతున్నారు . కొత్త కొత్త పథాలను వాడుకలోకి తీసుకొస్తున్నారు.
కవి చోడప్ప శతకం పదాలతో రాజకీయ విమర్శలు !
ఏపీ రాజకీయ నేతలు వాడుకలో లేని ముతక భాష చదువు, సంస్కారం లేని అనాగరిక బాషను ఏరి కోరి మరీ వినుల విందుగా వినిపిస్తున్నారు. సభలో మహిళలు చిన్నారులు ఉన్నా డోంట్ కేర్. ప్రత్యర్థిని బండబూతులు తిట్టామా లేదా అన్నదే ప్రదానం.. కవి చోడప్ప శతకం స్టడీ చేసి అందులోని పదాలను పట్టుకొచ్చి మరీ ఇష్టా రాజ్యంగా మాట్లాడటం ఇప్ఫడు నాయకులకు ఫ్యాషన్ అయింది..ఆ పార్టీ ఈ పార్టీ అన్నది లేదు అందరిదీ ఒకే బడి. ప్రజల ఎంకరేజ్ మెంట్ బలంగా బూతులు మాట్లాడే నాయకు ఉండటం అలాంటి నాయకులకు అగ్నికి వాయువు తోడైనట్లు మారింది.
సోషల్ మీడియా ప్రభావంతో మరింత దిగజారుతున్న భాష !
యూట్యూబ్ లో సంస్కార యుతంగా విమర్శలు చేసిన నాయకుడిని ఎవరూ పట్టించుకోరు. రెచ్చిపోయి పచ్చి బూతులు మాట్లాడే నాయకుడి వీడియోలకు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. వ్యూయర్ షిప్ లక్షలలో ఉంటోంది. ఒక నాయకడు త్వరగా ప్రజలకు రీచ్ కావాలంటే బూతులు మాట్లాడితే సరి అనే స్థితికి వెళ్ళిపోయారు. కనీసం పెద్దరికానికి సహితం గౌరవం ఇవ్వ కుండా వాడు, వీడు అనటం సహజం అయిపోయింది. బట్టలు ఊ డదీసి తంతానని ఒకరంటే, గడ్డలూడదీసి కొడతానని మరొకరు...ఇంటి కొచ్చి కొడతానని ఇంకొకరు..బజారులో పొల్లడిచ్చి తంతానని మరొకరు..అంకుశంలో విలన్ ని బజార్లో బట్టలు చించి తన్నినట్లు మరొక నాయకుడి వార్మింగ్ ఇవ్వటం మాములై పోయింది.
బూతే భవిష్యత్ అన్నట్లుగా నాయకుల తీరు !
మహిళా నాయకులు కూడా తగ్గేదే లే అంటున్నారు.. ప్రత్యర్థి పార్టీ నాయకులను బహిరంగ సభలలో మై సన్స్ అంటూ చక్కని భాషలో వార్నింగ్స్ ఇస్తున్నారు..ఇప్పటికి బూతు కవి చౌడప్ప రాసిన శతకాన్ని చాటు కవితలు అంటూ మార్కెట్లో పబ్లిక్ కా విత్రయించరు...మన రాష్ట్రంలో కొందరు నాయకులు కవి చౌడప్పను మించిపోయే విధంగా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు... వీళ్ళను మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయ్యలేరన్నది వాస్తవం..అధినాయకుడితో బలమైన బంధం ఏర్పడాలి అంటే ప్రత్యర్థిని బండ బూతులు తిట్ట వలసిందే అన్నట్లు తయారయ్యాయి ప్రస్తుత రాజకీయాలు..!