గన్నవరంలో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. తెలుగు దేశం పార్టి టిక్కెట్‌పై గెలిచిన స్దానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి మద్దతు చేప్పడంతో తమ్ముళ్లు తిరగబడుతున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. పనిలో పనిగా గన్నవరం సీట్ ఆశిస్తున్న వాళ్లు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. 


గన్నవరంలో అమీతుమీ


గన్నవరంలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. వరుసగా వివాదాలకు కేంద్రంగా మారింది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య ఘర్షణలతో నియోజకవర్గంలో నిత్యం పోలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం నేతలపై అధికార పార్టీకి చెందిన నేతల దాడులు, చేయటం సంచలనంగా మారింది. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. 


తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేయటం, అద్దాలను పగలకొట్టటంతోపాటుగా, పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేయటం, ఒక వాహనానికి నిప్పు పెట్టిన ఘటన కూడా సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టికి చెందిన నేతల యాక్షన్‌కు రియాక్షన్ ఇలాను ఉంటుందని స్థానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీ హెచ్చరిక కూడా ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు


గన్నవరంలో పట్టాభి పాగా ....?


గన్నవరం కేంద్రంగా జరిగిన ఉద్రిక్తతలకు తెలుగు దేశం పార్టికి చెందిన నేత పట్టాభి బాధ్యుడిని చేశారు పోలీసులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని తీవ్రంగా హింసించారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పోలీసులు తీరు పై తెలుగు దేశం పార్టికి చెందిన నేతలు ఆందోళనలు చేశారు. పట్టాభి భార్య సైతం తన భర్త అచూకి చెప్పాలంటూ ,తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డీజీపీని కలిసేందుకు ప్రయత్నించటంతో ఆమెను హౌస్‌ అరెస్టు చేశారు. 


ఇదంతా గన్నవరం సీటు కోసమే పట్టాభి తెలుగుదేశం తరపున రేస్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఢీ కొట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెట్టాలని, తెలుగు దేశం నేతలు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉండగానే, వల్లభనేని వంశీ గన్నవరంలో శాసన సభ్యుడిగా పాతుకుపోయారు. ఆయన్ను ఢీ కొట్టటం అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు. 


ప్రస్తుతం వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉంటున్నారు. దీంతో అధికార పక్షం నుంచి అన్ని విధాలుగా వంశీకి సహకారం ఉంది. గన్నవరంలో వంశీకి దీటుగా ఉండే అభ్యర్థి కోసం తెలుగు దేశం అన్వేషిస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. దీంతో ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు పట్టాభి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.


టీడీపీలో క్రియాశీలకంగా పట్టాభి....


తెలుగు దేశం పార్టీలో పట్టాభి ఇటీవల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్ష నేతలపై హాట్ కామెంట్స్ చేయటం ద్వారా, రాజకీయాల్లో పట్టాభి పేరు తెచ్చుకున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పట్టాభి, అధికార పక్షంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారటంతో ఆయన ఇంటిపై కూడా దాడి జరిగింది. అదే రోజు తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయి. 


ఈ దాడుల వ్యవహరంతో పట్టాభి హైలైట్ అయ్యారు. అధినేత చంద్రబాబు సైతం పట్టాభి ఇంటికి వెళ్ళి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కూడా పట్టాభిని పోలీసుల అరెస్ట్ చేసి తీవ్రంగా హింసించటంతో, ఆయన భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభి భార్యకు అండగా తెలుగు దేశం నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో మరోసారి చంద్రబాబు పట్టాభి ఇంటికి వెళ్ళి భార్య, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.