YS Sharmila Letter To CM Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు చేసిన అన్యాయంపై సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.  ఈ మేరకు ఓ బహిరంగలేఖ రాశారు.  మీ ఏలుబడిలో దయనీయంగా ఉన్న బడుగు బలహీనవర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) అత్యధికులు రాష్ట్రంలో ఎంతో దుర్బరమైన జీవితం గడుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు.  వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులతో పాటు జీవన ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేక చర్యలతో వారిని ఆదుకోవాల్సింది పోయి, వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి మీ పాలనలో ఎదురవుతోందని విమర్శించారు.


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లిస్తారా ? 


ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  . నిధులు దారి మళ్లించారని వారి కోసమని రూపొందించి, మీరొచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలు, కార్యక్రమాలను నిర్దయగా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయంగా వారిని ఎదగనీయకుండా, అవకాశాలకు కత్తెర వేసి మొగ్గలోనే తుంచే దుర్మార్గాన్ని మీరు పాటిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా, దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్టే ఉన్నారు. వాటిని నివారించి వారిని కా పాడే నిర్దిష్ట చర్యలు లేవు. ప్రధానంగా వారికి రక్షణ లేదు. పైగా, ఇలా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లు, మోతుబర్లు, రౌడీ మూకలేనని ఆరోపించారు.


ఆదరించిన ఎస్సీ, ఎస్టీల్ని వంచిస్తారా ? 


ఎన్నికల ముందు నుంచీ మిమ్మల్ని అక్కున చేర్చుకొని, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు మీపై ఎంతో విశ్వాసం చూపించారు. కానీ, మీరు..... ఎక్కడ అవకాశం దొరికినా, వేదికెక్కి ప్రసంగించినా 'నా ఎస్సీలు, నా ఎస్టీలు' అంటూనే వారిని వంచించారన్నారు.  మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. డా సుధాకర్ కు జరిగిన దారుణమైన అవమానమైతేనేమి, సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ మట్టుబెట్టిన విధానమైతేనేమి, దళితుల శిరోముండనమైతేనేమి, చివరికి మీ పార్టీ సీనియర్ నాయకుడు, దశాబ్దాల క్రితం దళితులపై చేసిన దాష్టీకాలకు, నేడు కోర్టులో శిక్షపడ్డా ఆయనను అందలం ఎక్కించాలని సిగ్గు, సంస్కరం వదిలేసినా మీ నాయక్వానికే చెల్లుతుంది. అయినా మర్దార్లు, గూండాయిజాలు చేసే నాయకులను మోసే సంస్కృతి మీలో నిలువెల్లా నిండిపోయిందని చెప్పకనే చెపుతోంది. అంతెందుకు, ఇప్పుడు కూడా మీ పార్టీలోని దళిత నాయకులు, ఏరుదాటి తెప్పతగలేసే మీ బరితెగించిన వాలకాన్ని తట్టుకోలేక ఎలా బయటకు వస్తున్నారో వేరే చెప్పాలా అని ప్రశ్నించారు.


ఎన్నికలయ్యాక ఎస్సీ,ఎస్టీల్ని ఎందుకు పట్టించుకోలేదు ? 
 
రాష్ట్ర జనాభాలో 16.8 శాతంగా ఉన్న ఎస్సీలు, 5.3 శాతంగా ఉన్న ఎస్టీలు ఎన్నికలయ్యాక మీ కంటికి కనిపించకపోవడం, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే కనిపించడం అన్నది అతిపెద్ద దుర్మార్గమన్నారు.  మీరు పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నాలుగేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు ఎంతటి అన్యాయం జరిగిందో గణాంకాలే చెబుతాయి. ఉప ప్రణాళిక కింద బడ్జెట్ లో ఎస్సీలకు ప్రతిపాదించిన రూ. 89,706 కోట్లకు బదులు రూ. 66,656 కోట్లు మాత్రమే కేటాయించి రూ. 23,050 కోట్లకు గండికొట్టారు. ఇదే ఉప ప్రణాళిక ప్రకారం ఎస్టీలకు వాస్తవిక బడ్జెట్ రూ. 28,990 కోట్లు కాగా, రూ. 22,443 కోట్లు మాత్రమే కేటాయించి రూ.6547 కోట్ల మేర గండికొట్టారు. దీన్నిబట్టి ఎస్సీ, ఎస్టీల పట్ల మీ చిత్తశుద్దిని అర్థం చేసుకోవచ్చన్నారు.    
 
దళితలపై దాడులు ఎక్కువ ! 


దక్షిణ భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంత ఘోరంగా దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని షర్మిల లేఖలో పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు రక్షణే లేకుండా పోతోంది. నెలకు సగటున ముగ్గురు హత్యలకు గురవుతున్నారు. వారానికి నలుగురు దళిత' గిరిజన మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సగటున రోజూ ఏడు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని..   2021లో స్వయానా మీ సాంఘిక సంక్షేమ శాఖ వారు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక స్పష్టం చేసిందన్నారు.   రాజకీయంగా కూడా ఎస్సీ, ఎస్టీలపైన మీది చిన్నచూపే! స్థిరంగా ఎదగనీయకుండా వారిని మొక్కగా ఉన్నపుడే చిదిమేస్తారా? ఎస్సీల్లో 12 మంది సిట్టింగ్ కు ఇప్పుడు మీ పార్టీ టిక్కెట్టు నిరాకరించారు. మరో 6 మందికి స్థానచలనం కలిగించారు. కింది స్థాయిలోని స్థానిక సంస్థల్లోనూ ఇదే పరిస్థితి అన్నారు.   125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థాపిస్తారు. ఆయన విధానాల స్ఫూర్తిని మాత్రం సమాధి చేస్తారా? ఇదెక్కడి న్యాయమని షర్మిల ప్రశ్నించారు.  ఇకపై ఏ వివక్షా లేకుండా, తప్పులు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యల్ని తక్షణం చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు.  అరకులో 


అరకు నియోజకవర్గంలో ప్రచారం


ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అరకు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.   బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రజా అభిప్రాయం గౌరవించారు   వద్దు అంటే వదిలేశారన్నారు.  ఇప్పుడు జగన్ అక్రమంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారన్నారు.  అదానీ లాంటి వాళ్లకు 7 హైడ్రో  పవర్ ప్రాజెక్ట్ లకు అనుమతి  ఇచ్చాని.  ఇది అక్రమం కాదా అని  ప్రశ్నించారు.   కనీసం 45 ఏళ్లకే పెన్షన్ పథకం ఎంతమందికి ఇస్తున్నారో తెలియదన్నారు.  - అప్పులు తప్పా మనకు ఏమీ లేదు .య.  చేతిలో చిప్ప తప్పా...ఏమి లేదు ..   మళ్ళీ ఇలాంటి పార్టీలను మనం గెలిపించడం అవసరమా అని షర్మిల ప్రశ్నించారు.