Revant Reddy Biography:    తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలో పార్టీ ని ముందుండి నడిపిస్తున్న సారథి రేవంత్  రెడ్డి అభిమానులకి మరింత ఉత్తేజాన్ని కలిగించే వార్త  ఇది. అనుముల రేవంత్ రెడ్డి సామర్థ్యాన్ని మరింత చాటేలా ఓ బయోగ్రఫీ సిద్ధం అవుతోంది. A Telangana Biography పేరుతో సిద్ధం చేస్తున్న ఈ బయో ఫిల్మ్ ద్వారా .. రేవంత్ రేంజ్  ఏంటో చూపిస్తాం అంటున్నారు మేకర్స్. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలంగాణ సాధకుడి గా క్రెడిట్ ఉన్న కెసిఆర్ ఒక వైపు ఉంటే.. అంతటి  కెసిఆర్ ను ఎదుర్కునే స్టేచర్ రేవంత్ కు ఉందని ఆయన ఫాన్స్ నమ్ముతారు. తెలంగాణలో ప్రస్తుతం కెసిఆర్  తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నేత రేవంతే.  తెలంగాణ రాజకీయాలు అన్నీ రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని రేవంత్ రెడ్డికి అన్వయించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు.  


ధూమ్ థామ్ గా పుట్టిన రోజు వేడుకలు


కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నారు. ఆ సభలకు జనస్పందన భారీగా ఉంటుంది. రేవంత్ రెడ్డి కి గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు . కానీ అప్పట్లో ఆయనకు పార్టీపై ఇంత పట్టు లేదు. ఇప్పుడు టీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు.  అంతా ఆయన హవా ఉందని.. టిక్కెట్లు రాని వాళ్లు ఆయనపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చిన వాళ్లు..  పార్టీకి విధేయంగా ఉన్న వాళ్లు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది రేవంత్ వల్లేనని ఆయన పుట్టిన రోజును గట్టిగా సెలబ్రేట్ చేస్తునారు. 


ప్రత్యేక డాక్యుమెంటరీని రిలీజ్ చేయబోతున్న అభిమానులు


ఎన్నికల ప్రచారం జోరు మీద వుండగానే పుట్టిన రోజు రావడం తో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు కంటే మెరుగు అవ్వడం.. గెలిస్తే సీఎం గా రేవంత్ కే ఎక్కువ ఛాన్స్ ఉండటం తో హంగామా ఎక్కువ గానే ఉంది. కాంగ్రెస్ లో  రేవంత్ తిరుగులేని నేత అని చాటెందుకు ఆయన ఫాన్స్ బయోగ్రఫీ సిద్ధం చేశారు. రేవంత్ ఇంటిపేరు స్ఫురించేలా A అనే అక్షరాన్ని బేస్ చేసుకుని... Telangana Biography పేరుతో ఫిల్మ్ సిద్ధం  చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పిక్చర్ రిలీజ్ చేశారు. తెలంగాణ కు సింబాలిజం గా కెసిఆర్ ఉన్నారు. తెలంగాణ సాధన లో ఫ్రంట్ రన్నర్ గా కెసిఆర్ ఆ క్రెడిట్ సాధించారు. అయితే ఇప్పుడు రేవంత్ బయోగ్రఫీ కి ఆయన పేరు కాకుండా తెలంగాణ బయోగ్రఫీ అనే పేరు పెట్టడం కూడా కెసిఆర్ క్రెడిట్ ను తగ్గించే వ్యూహం లో భాగమే. 


కింది స్థాయి నుంచి ఎదిగిన నేత 


రేవంత్ రెడ్డికి ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. మొదట జడ్పిటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని మిడ్జిల్ నుంచి జడ్పీటీసీగా స్వతంత్రంగా గెలిచారు. అక్కడే ఆయన ప్రజలను ఆకట్టుకునే  నాయకత్వం బయటపడింది. తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా ఆయన టీడీపీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా రాజకీయ పునరేకీకరణ కోసం కాంగ్రెస్ లో చేరి ఆ దిశగా ఇప్పుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. . తెలంగాణ బయోగ్రఫీ పేరుతో అనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించనున్నారు .. ఈ బయోగ్రఫీపై సోషల్ మీడియాలో ఆసక్తి ఏర్పడింది. 


కాంగ్రెస్ ను గెలిపిస్తే చరిత్ర సృష్టించినట్లే


రేవంత్ రెడ్డి ముందు ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఆయన ఇమేజ్ ఇప్పుడు ఉన్నదానికన్నా అమాంతం పెరుగుతుంది. ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందుతారు. ఇటీవల  నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్స్ లో కేసీఆర్ తర్వాత సీఎం అభ్యర్థిగా ఆయనకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు  కొన్ని సర్వేల్లో కెసిఆర్ కు దగ్గరగా ఓట్ల శాతాన్ని సాధించారు