Prashant Kishore seems to have finalized Vijay alliance with AIADMK: తమిళనాడు లో 2026లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. స్టాలిన్ సు ధీటైన నాయకుడు లేడని ప్రచారం జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ విజయం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పార్టీని ప్రారభించి.. డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడుతుతున్నారు. తాజాగా ఆయన ప్రశాంత్ కిషోర్ తో కలిసి స్ట్రాటజీలపై చర్చించారు. ప్రశాంత్ కిషోర్ - విజయ్ భేటీ రాజకీయంగా తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
గత ఎన్నికల్లో డీఎంకేకు పని చేసిన ప్రశాంత్ కిషోర్
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ డీఎంకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేశారు. అయితే ఆ తర్వాత ఆయన స్ట్రాటజిక్ పనులకు దూరంగా ఉన్నారు. బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు. అయితే తనను సంప్రదించే రాజకీయ నేతలకు సలహాలు మాత్రం ఇస్తున్నారు. డీఎంకే పార్టీ ప్రశాంత్ కిషోర్ తో తర్వాత సంబంధాలు కొనసాగించలేదు. దీంతో పీకే ఆ పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు అన్నాడీఎంకే కు పని చేశారు. తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రధాన వ్యూహకర్తగా మారారు.
టీవీకే, అన్నాడీఎంకే మధ్య పొత్తును ప్రతిపాదించిన ప్రశాంత్ కిషోర్
తమిళనాడు మీడియా వెల్లడిస్తున్న సమాచారం మేరకు.. ప్రశాంత్ కిషోర్.. విజయ్ పార్టీ, అన్నాడీఎంకే పార్టీ మధ్య పొత్తును ప్రతిపాదించారు. రెండు పార్టీలు కలిస్తే తప్ప డీఎంకేఓడించడం అసాధ్యమని చెప్పినట్లుగా తెలుస్తోంది. పైగా విడివిడిగా పోటీ చేస్తే డీఎంకేకు భారీ మెజారటీలు వస్తాయని విశ్లేషించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అన్నాడీఎంకే నాయకత్వంతోనూ చర్చించినట్లుగా చెబుతున్నారు. పట్టు విడుపులకు పోకుండా రెండు పార్టీలు కలిస్తే రాజకీయం హోరాహోరీగా మారుతుందన్న అంచనాలను వేస్తున్నారు.
అన్నాడీఎంకే రెడీ - మరి విజయ్ ఆలోచన ఏమిటో ?
విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత అన్నాడీఎంకేను పల్లెత్తు మాట అనలేదు. పూర్తిగా డీఎంకేనే టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో విజయ్ వ్యూహాత్మకంగానే ఉన్నారని అంటున్నారు. జయలలిత అభిమానులంతా ఏకపక్షంగా తన వైపే ఉంటే.. విజయం సునాయసం అవుతుందని విజయ్ భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. తమిళనాడు రాజకీయంలో వేడి పెరిగే అవకాశం ఉంది.
విజయ్ రాజకీయాల్లోకి రావడంతో స్టాలిన్ తన వారసుడిగా తన కుమారుడు ఉదయనిధిని ప్రకటించారు. ఎన్నికల వంటి కీలక విషయాల్లో ఉదయనిధి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పై పూర్తి పట్టు సాధించారు. స్టాలిన్ .. విజయ్ కు పోటీగా రాజకీయం చేయరని .. తన కుమారుడ్ని తెర ముందు ఉంచారని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయ్ వర్సెస్ ఉదయనిది అన్నట్లుగా ఎన్నికలు సాగుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్ అరెస్టుపై కేరళలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు, సెలబ్రిటీలకు కీలక సూచనలు