Pawan Kalyan focused on ST constituencies  which are strong for YCP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. తాను బలపడటం  మాత్రమే కాదు వైసీపీని మరితం బలహీన పరిచేదుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు. 


గిరిజన ప్రాంతాల్లో వైసీపీకి పట్టు 


వైసీపీకి ఎంత ఎదురుగాలి వీచినా గిరిజన ప్రాంతాల్లో మాత్రం పట్టు నిలుపుకుంది. అరకు పార్లమెంట్ సీటును గెల్చుకుంది. అరకు, పాడేరు ఎమ్మెల్యే సీట్లనూ గెల్చుకుంది. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి వచ్చిన రెండు సీట్లు అవే. పార్టీ అభ్యర్థులు బలమైన వారు కాదు.  పార్టీ బలం మీదనే వారు గెలిచారు. ఇప్పుడు ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన వర్గాల్లో వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టేందుకు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఓట్లు వేయకపోయినా మీకు సమస్యలు తీరుస్తామని చెప్పారు.


Also Read: Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !


గిరిజనులకు వైసీపీ ఏమీ చేయలేదని బలంగా ప్రచారం చేస్తున్న పవన్ 


తమకు ఓట్లు వేయకపోయినా మంచి చేస్తామని డోలీ మోతల్ని లేకుండా చేస్తామని ఉపాధి అవకాశాల్ని పెంచుతామని భరోసా ఇస్తున్నారు.   ఓట్లు వేసిన వాళ్లు గిరిజనుల్ని దోచుకున్నారని .. అటవీ సంపదను తరలించారని.. ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నారు కానీ యాభై కోట్లు పెట్టి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని ఆరోపించారు. ఈ మాటలన్నీ గిరిజనులలో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నమేనని చెప్పక తప్పదు. గిరిజన ప్రాంతాల్లో వైసీపీ బలంగా ఉండటానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. గిరిజనుల్లో మత మార్పిడి ఎక్కువగా ఉండటంతో వారంతా వైసీపీకి మద్దతుగా మారారని అంటున్నారు. వారంద్నీ మార్చడం కష్టమే అయినా అసాధ్యం కాదని జనసేన భావన అని అంచనా వేస్తున్నారు.                        


Also Read: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత


తరుచుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటన                                


మరో వైపు తరచుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించి టూరిజం అభివృద్ధి చేసి వారికి ఆదాయాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నారు. తన ఆలోచన సక్సెస్ అయితే వారు మారుతారని అంటున్నారు. ముందు కడుపు నింపుకుంటేనే ఆ తర్వాత దేవుడని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ చాలా స్పష్టతతో ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయాలు ఓ రోడ్ మ్యాప్ ప్రకారం జరిగిపోతున్నాయని చెబుతున్నారు.