Is Telugu Leaders Follow Tamil Nadu BJP leader Annamalai style protests:  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త మార్గాలు ఎంచుకున్నారు. డీఎంకేను ఓడించేదాకా చెప్పులు వేసుకోనని ప్రకటించారు. అంతేనా తనను తాను ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. మూడు రోజుల దీక్ష ప్రారంభించారు. అన్నామలై నిరసన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తనను తాను హింసించుకోవడం అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో కాాల్సింది ఇదే. ఎక్కువగా ప్రచారం పొందడం. అన్నామలై ఈ విషయంలో అనుకున్న ఫలితం సాధించారని అనుకోవచ్చు. 


తమిళనాట విజయ్ ఎంట్రీతో తీవ్ర పోటీ 


తమిళనాడు రాజకీయాలు చాలా పోటాపోటీగా మారాయి. సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ పెట్టక ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం బహుముఖ పోటీగా మారిపోయింది. స్టాలిన్ తన వారసుడిగా ఉదయనిధిని రంగంలోకి తెచ్చారు. ఆయన ఇప్పుడు డీఎంకే వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. విజయ్‌తో స్టాలిన్ పోటీపడటం అంటే అంత బాగుండదని ఉదయనిధిని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు తమిళ రాజకీయాలు డీఎంకే వర్సెస్ టీవీకే వర్సెస్ బీజేపీతో పాటు అన్నాడీఎంకే అన్నట్లుగా సాగుతోంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటములు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ రెండు కూటములు కాకుండా టీవీకే, బీజేపీ విడివిడిగా రాజకీయం చేస్తున్నాయి. ఈ కారణంగా పోటీ తీవ్రమైంది. అందరిలోనూ ప్రత్యేకత సాధించడానికి అన్నామలై ఇలాంటి వ్యూహాత్మక నిరసనలతో ప్రయత్నం చేస్తున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి తీవ్ర నిరసనలను ప్రతిపక్షనేతలు ప్లాన్ చేసుకుంటారా ? 


అన్నామలై నిరసనలు హైలెట్ కావడంతో చాలా మంది తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నేతలు ఇలాంటి వైల్డ్ నిరసనలు ప్లాన్ చేసుకోవాలని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు. వీరు సీరియస్ గా అంటున్నారో ట్రోలింగ్ కోసం అంటున్నారో అర్థం చేసుకోవడం కష్టం. ట్రోలింగ్ అయితే అన్నామలై అంత చేసి కామెడీ అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి  రాజకీయాల్లో ఎవరు ఏం చేసినా ట్రోలింగ్ చేసేందుకు వేర్ ప్రత్యర్థి పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ రెడీగా ఉంటుంది. అలాంటి వాటిని పట్టించుకుంటూ ఉంటే ముందుకు సాగడం సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అందుకే సేమ్ టు సేమ్ కాకపోయినా అలాంటి తీవ్రమైన పోరాటాలు ఉండాలని కొంత మంది కోరుకుంటున్నారు. 


అరవ అతి మనకు అతకదు కదా !


మరో వైపు తమిళ సినిమాలు తెలుగులో విడుదలైనప్పుడు అరవ అతి కనిపించిందని కొంత మంది రివ్యూ ఇస్తూంటారు. అక్కడి ప్రజలకు తెలుగు సినిమాల్లో కన్నా ఉండే ఎక్కువ అతి కావాలి.అలా ఉన్న సినిమాలో హైలెట్ అవుతాయి. అది మనకు కామెడీగా అనిపిస్తుంది కానీ.. అక్కడి సినిమాలు హిట్ అవుతాయి. అందుకే అన్నామలై నిరసన మకు కాస్త అతి అనిపిస్తుంది కానీ.. తమిళనాడు ప్రజలకు నచ్చే ఉంటుంది. అలాగని తెలుగు రాష్ట్రాల ప్రతిక్ష నేతలు ఇలా నిరసనలు వ్యక్తం చేయడం అతకదని అంటున్నారు. అయితే ఆ స్థాయిలో కాకపోయినా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు అలాంటి వైల్డ్ ఐడియాతో ముందుకు రావాలని మాత్రం ఆయా పార్టీల సానుభూతిపరులు కోరుకుంటున్నారు. 



Also Read: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు