CPI Narayana Vs Nagababu :  సీపీఐ సీనియర్ నేత నారాయణపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు.  సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు.. అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి ... అని సలహా ఇచ్చారు. నాగబాబు ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. 



సీపీఐ నారాయణపై నాగబాబు ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం... సోమవారం చిరంజీవిపై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. 


మోదీ, కేసీఆర్ ఇద్దరూ కోరల్లేని పాములే, వైఎస్ జగన్ నిర్ణయం చెల్లదు - సీపీఐ నారాయణ


టీడీపీ, వైఎస్ఆర్‌సీపీని కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు విమర్శించారు. అయితే చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు హైలెట్ అయ్యాయి. ఈ మాటలు సహజంగానే మెగా ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. ఉదయం నుంచి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకున్నారు. సాయంత్రానికి నాగబాబు కూడా ట్వీట్ చేశారు. 


ఏపీలో భూసర్వేపై అధికారులకు టార్గెట్- అక్టోబర్‌కు పూర్తి చేయాలన్న మంత్రుల కమిటీ


నారాయణ ఇలా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లో లేరు. ప్రత్యక్ష రాజకీాయల నుంచి విరమించుకున్నానని ఆయన నేరుగానే చెప్పారు. రాజకీయాల్లో లేని చిరంజీవిపై నారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిమానులు అంటున్నారు.  తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై సీపీఐ నారాయణ ఇంకా స్పందించలేదు.  


పోలవరం కేంద్రంగా మళ్లీ విభజన సెంటిమెంట్ పాలిటిక్స్ - వర్కవుట్ అవుతుందా ?