తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ తన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా తమిళనాడు బీజేపీ శాఖకు పీఆర్వో వ్యవహరిస్తున్న వ్యక్తిని నియమించుకోవడాన్ని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దన్ ఓవైసీ  ప్రశ్నించారు. పీఆర్వోగా తమిళనాడు  బీజేపీ నేతను నియమించుకోవడం అనుచితమని ఓవైసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను ఈ నియామకం ప్రశ్నార్థకం చేస్తుందని ఓవైసీ ట్వీట్‌లో పేర్కొన్నారు 



తెలంగాణ గవర్నర్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే తాను ఎక్కడ రాజకీయం చేశానో చెప్పాలని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. తనకు  ప్రోటోకాల్ ఇవ్వడం లేదని.. కనీసం గౌరవించడం లేదని తమిళిసై అంటున్నారు. అదే సమయంలో వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న సంఘటనలపై ప్రతీ రోజూ స్పందిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల అంశంలో జరిగిన స్కాంపై కాళోజీ మెడికల్ వర్శిటీ వీసీని నివేదిక అడిగారు. శుక్రవారం జరిగిన ఓ ప్రేమోన్మాది  దాడి ఘటనపైనా ఆరా తీశారు. రోజువారీగా ఆమె యాక్టివ్ అవుతూండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. 


ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలపై గడ్కరీ సీరియస్ - అలా జరిగితే కఠిన చర్యలు తప్పవు!


అయితే టీఆర్ఎస్‌కు మద్దతుగా అసదుద్దీన్ ఓవైసీ కూడా రావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మరితం బలాన్నిస్తోంది. బీజేపీ నేతలను పీఆర్వోగా పెట్టుకుని తమపై రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడానికి అవకాశం చిక్కింది. ఇప్పటి వరకూ గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య  చాలా వరకూ వివాదాలు నడిచినా ఇప్పటి వరకూ ఎంఐఎం జోక్యం చేసుకోలేదు. తొలిసారి ఓవైసీపీ గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారు. 


‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఓవైసీ గవర్నర్‌కు వ్యతిరేకంగా ట్వీట్ పెట్టినట్లుగా భావిస్తున్నారు.