చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తక్షణం అవన్నీ అబద్దమని ప్రకటించి క్షమాపణ చెప్పాలని లేకపోతే రూ. పది కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు. ఈ మేరకు తన లాయర్‌తో లీగర్ నోటీసును పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.
నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
బీజేపీ పార్టీకి చెందిన మల్లన్న దుర్బుద్ధితో, జర్నలిస్ట్ గా చెలామణి అవుతూ జర్నలిజం లో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువుకు భంగం కలిగించేలా, అసత్యపూరిత ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి 10 కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 7 రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడ అజయ్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
రైతుల వద్దకు "డిక్లరేషన్" - "రచ్చబండ" ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి
తీన్మార్ మలన్నకు క్యూ న్యూస్ పేరుతో యూ ట్యూబ్ చానల్ ఉంది.. అలాగే శనార్తి తెలంగాణ పేరుతో పత్రికను నడుపుతున్నారు. వీటిల్లో ఇటీవలి కాలంలో పువ్వాడ అజయ్‌పై తీవ్రమైన ఆరోపణలతో కథనాలు వచ్చాయి. అవి వైరల్ కావడంతో పువ్వాడ అజయ్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటి వరకూ తీన్మార్ మల్లన్న స్పందించ లేదు. మూాడు రోజుల కిందటే మంత్రి అజయ్ ... తీన్మార్ మల్లన్న తో పాటు ఆయన అనుచరులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు లీగల్ నోటీస్ జారీ చేశారు.
గతంలో వరుస కేసుల కారణంగా చాలా కాలం పాటు జైల్లో ఉన్న తీన్మార్ మల్లన్న బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇటీవల ఆ పార్టీకి తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించలేదు కానీ ఇక ఆ పార్టీ ఆఫీసుకు పోయేది లేదన్నారు. ఈ క్రమంలో తెలంగామ మంత్రి ఒకరు ఆయనపై రూ. పది కోట్ల పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించడం కలకలం రేపుతోంది.