Minister Komati Reddy Challenge to Ktr: తెలంగాణలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గురువారం సీఎం రేవంత్ (CM Revanth Reddy) రెడ్డికి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసరగా, దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 'ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేద్దాం. నేను సిరిసిల్లలో పోటీ చేస్తాను. నాపై కేటీఆర్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తానంటూ కేసీఆర్ ప్రకటన చేస్తారా.?. కేటీఆర్ కు పరిజ్ఞానం లేదు. ఛాలెంజ్ చేసే స్థాయి కేటీఆర్ ది కాదు. ఆయన దగ్గర లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేవు కానీ క్యారెక్టర్ ఉంది.' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 


సీఎం సవాల్.. కేటీఆర్ ప్రతి సవాల్ 


అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటు గెల్చుకుని చూపించాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. రేవంత్  కు దమ్ముంటే  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రావాలని.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దామని సవాల్ చేశారు. అది అయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలన్నారు. తాను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరం పదవులకు రాజీనామా చేసి పోటీ చేద్దామని చేసిన ఛాలెంజ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. గెలిచిన ప్రతిసారి మగవాడిని .. ఓడితే  కాదు అంటావా అని సీఎం రేవంత్ ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా అని మండిపడ్డారు. 'మగాడివి అయితే.. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయి.. అడబిడ్డలకు రూ.2,500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలి.' అని పేర్కొన్నారు. కొండగల్,  గ్రేటర్ ఎన్నికల్లో  పోటీ చేసి… సవాల్ విసిరి పారిపోయాడని కేటీఆర్ గుర్తు చేశారు. తనది మేనేజ్మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా అని ప్రశ్నించారు. రేవంత్ ది పేమెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమెంట్ కోటా అన్నారు.  పేమెంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… ఢిల్లీకి పేమెంట్ చేయాలంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి కేటీఆర్ కు ఛాలెంజ్ చేశారు.


'మాకు ప్రత్యర్థి బీజీపీయే'


లోక్ సభ పోటీలో తమకు ప్రత్యర్థి బీజేపీయేనని, బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అన్నారు. 'రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించాం. నల్గొండ, భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరుతున్నాం. 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చే భాద్యత మేం తీసుకుంటాం. అరవింద్ ను ప్రజలు మర్చిపోయారు. రూ.2 వేల కోట్లు నాకు ఉన్నాయని అంటే భయం వేసింది. రాజకీయాల వల్ల ఆస్తులు పోగుట్టుకున్నాం. నాతో పాటు ఉత్తమ్ కుమార్ ఆస్తులు కూడా తగ్గాయి. నా పేరు మీద ఎక్కడైనా ఆస్తులు ఉంటే అరవింద్ కు ఇస్తాను. బీఆర్ఎస్ ఎలాగూ లేదు... బీజేపీకి రెండు, మూడు వస్తాయేమో మాకైతే తెలీదు.' అంటూ పేర్కొన్నారు.


Also Read: BRS MP BB Patil joins BJP: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్