KTR Comments :  కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చేయిస్తున్న సర్వేలే ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు . టీఆర్ఎస్ గెలుస్తుందని ప్రత్య.ర్థులుకూడా ఒప్పుకుంటున్నారన్నారు. ఎనిమిదేండ్ల తర్వాత కూడా ప్రజల నుంచి మంచి స్పదం వస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా స్థానాలు వ‌స్తాయ‌ని త‌మ స‌ర్వే చెబుతుంద‌ని ...తమ ఒక్క పార్టీనే రాష్ట్రం మొత్తం ఉందన్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన పలు అంశాలపై తన ఆలోచనలు వివరించారు. 


కలసి కట్టుగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక ప్రదర్శనలు - విపక్ష నేతలతో కేసీఆర్ మంతనాలు !


కేసీఆర్ ఎవరికీ బెదరరు ! 


కేసీఆర్ ఎవ‌రికీ బెద‌ర‌డు.. లొంగ‌డు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. వాపును చూసి కొంద‌రు బ‌లుపు అనుకుంటున్నారు. బీజేపీ డ‌బుల్ ఇంజిన్ మోదీ, ఈడీ అని ఎద్దెవా చేశారు. మంచి ప‌నుల‌తో మ‌న‌సులు గెల‌వ‌డం బీజేపీకి తెలియ‌దు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చ‌చ్చిపోయింద‌న్నారు. సిరిసిల్ల‌కు రాహుల్ వ‌స్తే స్వాగ‌తిస్తాం.. వ‌చ్చి నేర్చుకోమ‌నండి అని కేటీఆర్ సూచించారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే 2023లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 


సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏపీ రోడ్ల ఫోటోలే - నెంబర్ వన్‌గా ట్రెండ్ చేసిన జనసైనికులు !


బీజేపీ వాళ్లు ముందస్తు సవాల్‌కు అంగీకరించ లేదు !


బీజేపీ వాళ్లు తేదీ ప్ర‌క‌టిస్తే అసెంబ్లీ ర‌ద్దు చేస్తామ‌ని సీఎం చెప్పారు. కానీ బీజేపీ నుంచి స్పంద‌న లేద‌న్నారు కేటీఆర్. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలో ఉంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాలు తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్నాయ‌ని గుర్తు చేశారు. రైతుల‌పై కేంద్రం క‌క్ష క‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్ష‌న్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.


ఫామ్‌హౌస్‌లు కాపాడుకోవడానికే జంట జలాశయాలను ఖాళీ చేస్తున్నారా ? మాజీ ఎంపీ ఎవరిని టార్గెట్ చేశారు ?


టీఆర్ఎస్‌కు సర్వేలు చేస్తున్న పీకే టీం  


తెలంగాణలో పలు సంస్థలు రోజుకో సర్వేను వెలువరిస్తున్న సందర్భంలో కేటీఆర్ తమ సర్వే గురించి చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తమకు 90 స్థానాలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్‌కు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం సేవలు అందిస్తోంది. వారే సర్వేలు చేస్తున్నారు.