Tadipatri JC :    తాడిపత్రిలో భయానక పరిస్థితులు ఉన్నా ఎస్పీ ఏం చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. దేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకుటున్న సమయంలో తాడిపత్రిలో ఇద్దరు మహిళలపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన తాడిపత్రిలో సంచలనం సృష్టించింది. పెట్రోల్ దాడిలో గాయపడ్డ మహిళలను   జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.  ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. 


తాడిపత్రిలో భయానక పరిస్థితులు ఉన్నాయన్న జేసీ 


గాయపడ్డ మహిళలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని..   పోలీసులు నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.  తాడిపత్రిలో ఇంత భయానకంగా వాతావరణ ఉంటే జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారని.. ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాల్సి ఉందన్నారు.   పోలీసుల ప్రతాపం మాపై కాదు... బాధితులకు అండగా ఉండండని సలహా ఇచ్చారు.   రౌడీ షీటర్ కింద మాలాంటి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం స్పందన ఉండదన్నారు.  మట్కా, మద్యం తాగడం, అమ్మే వాళ్లకు కౌన్సెలింగ్ చేయాలన్నారు. అయితే  సామాన్యులపై రౌడీ షీట్లు పెట్టి బౌండోవర్ చేస్తున్నాని. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై పెట్రోల్ దాడులకు పాల్పడిన వారెవరో అందరికీ తెలుసని..రాజకీయంగా వారికి పలుకుబడి ఉన్నప్పటికీ వదిలి పెట్టవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకిహితవు పలికారు.  స్టేషన్లు కు పిలిపించి మాట్లాడాలన్నారు. 


ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !


ఇద్దరు మహిళలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు


తాడిపత్రి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత  కొంత మంది దుండగులు గాఢ  నిద్రలో ఉన్న మహబూబ్ చాంద్(35), నూర్ జహన్ (65) లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితులిద్దరు వరుసకు పిన్ని కూతుర్లు.  ఈ ఘటన తో కాలనీ వాసులు ఉలిక్కి పడ్డారు. దాదాపు 10 మందికి పైగా ఈ ఘటలో పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతోంది. బాధితులను రక్షించే క్రమంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. భాదితులు ఇద్దరికి స్థానిక ఆసుపత్రి లో చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన 4 గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.  


మునుగోడులో టీఆర్ఎస్‌కు షాక్ - బీజేపీలో చేరిన చౌటుప్పల్ ఎంపీపీ !


ఘటనపై ఇంత వరకూ నోరు విప్పని పోలీసులు


ఈ ఘటనపై పోలీసులు ఇంత వరకూపెద్దగా స్పందించలేదు. ఇద్దరు మహిళలను సజీవ దహనం చేసే ప్రయత్నం ఎందుకు చేశారన్నదానిపై నోరు విప్పడం లేదు.  దర్యాప్తు జరుగుతోందని.. వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న కారణగానే పోలీసులు చురుగ్గా స్పందించడం లేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  అయితే  ఇప్పటికే నలుగుర్ని అదుపులోకి తీసుకున్నామని మిగతా వారి కోసం వెదుకుతున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కారణాలేమిటో అన్నీ బయట పెడతామంటున్నారు.