Janasena Workers bought a car for Polavaram MLA Chirri Balaraju :  ఎమ్మెల్యేగా గెలవాలంటే కార్యకర్తల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి. కానీ కార్యకర్తలే గెలిపించి ఆ తర్వాత ఆయనకు నియోజకవర్గంలో తిరగడానికి ఓ కారు కూడా కొనిపించారు కార్యకర్తలు. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఈ అభిమానం దక్కింది.        
 
పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు జనసేన పార్టీ కార్యకర్తలు ఓ కారును బహుకరించారు. గిరిజన రైతు అయిన చిర్రి బాలరాజు జనసేనలో చురుగ్గా తిరిగేవారు. అయితే ఆ సీటు జనసేనకు వస్తుందని.. చిర్రి బాలరాజుకు సీటు వస్తుందని అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. చివరికి కేటాయించారు.  సీటు వచ్చిన వెంటనే ఆయన టీడీపీ నేతల్ని కలుపుకున నియోజకవర్గం అంతా తిరిగారు. ప్రజలు కూడా ఆదరించారు. తమలో ఒకడని.. తమ సమస్యలు తీరుస్తారని భావించి .. మంచి మెజార్టీతో గెలిపించారు.                    


వైసీపీ నేతలు దోచినదంతా స్వాధీనం చేసుకోవాలి - ప్రభుత్వానికి ఐడియాలు పంపిన యనమల


అయితే  ఇప్పుడు ఆయనకు నియోజకవర్గంలో తిరగడానికి కారు లేదు. ఎన్నికల సమయంలో ఎలాగోలా అద్దె కార్లతో ప్రచారం చేశారు.  గెలిచిన తర్వాత సొంత కారు కొనే స్థోమత లేకపోవడంతో.. పార్టీ కార్యకర్తలంతా కలిసి ఇన్నోవా కారు కొనిపించారు. అయితే ఆ కార్యకర్తలేమీ డబ్బులున్నవాళ్లు కాదు. అందుకే డౌన్ పేమెంట్ వరకూ తామే కట్టారు. తమకు తోచినంత విరాళాలు వేసుకొని రూ. 10 లక్షలు పోగుచేశారు. 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును కొనిచ్చారు. మిగిలిన సొమ్మును నెలనెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే బాలరాజు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. జనసైనికులు తన పట్ల చూపిన అభిమానానికి ఎమ్మెల్యే బాలరాజు సంతోషం వ్యక్తం చేశారు.      


చిర్రి బాలరాజు ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను యాభై రెండు లక్షలుగా పేర్కొన్నారు. అందులో వ్యవసాయ భూమి విలువ ఎక్కువ ఉంది. అలాగే పదకొండు లక్షలకుపైగా బ్యాంకుల వద్ద అప్పు ఉంది. ఆయన భార్య ఆశావర్కర్ గా పని చేస్తున్నారు.  యువకుడు అయిన చిర్రి బాలరాజు.. పోలవరం నియోజకవర్గంలో నిర్వాసితులకు మేలు చేస్తారని.. గిరిజనలకు అండగా ఉంటారని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పేరు నిలబెడతానని.. కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయనంటున్నారు. 


బీజేపీకి మద్దతుగానే వైసీపీ - టీడీపీ, జనసేన కూటమిలో ఉన్నా జగన్ ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు ?


వ్యవసాయ కుటుంబా నికి చెందిన బాలరాజుది జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.