Bolisetty Srinivas Sensational Comments On Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై జనసేన తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetty Srinivas) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌తో (Allu Arjun) తనకు కానీ, తన పార్టీకి కానీ ఎలాంటి శత్రుత్వం లేదని.. మమ్మల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినందు వల్లే అలా మాట్లాడానని అన్నారు. అల్లు అర్జున్ మళ్లీ ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తానని చెప్పారు. కాగా, ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్ హాల్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌ తన మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అంటూ కామెంట్స్ చేశారు. నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానని అన్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌ను పొగుడుతూ 'మీరు నా ఆర్మీ' అంటూ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్‌గా మారాయి. ఇవి పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అంటూ అంతా భావించారు. వీటిపైనే బొలిశెట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


'మెగా ఫ్యాన్స్ మాత్రమే'


మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తాను అన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపై బొలిశెట్టి శ్రీనివాస్ స్పందిస్తూ.. 'రాకపోతే పో.. నిన్నెవరు పిలిచారు.? అసలు అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారా.?. నాకు తెలిసినంత వరకూ మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. ఆయనకు ఉంది షామియానా కంపెనీ మాత్రమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్లను అల్లు అర్జున్‌లో చూసుకోబట్టి నీకు ఫ్యాన్స్‌గా ఉన్నారు గానీ మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎవరు.?' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ప్రచారం చేసిన నంద్యాలలో ఆ అభ్యర్థి ఓడిపోయారని.. తాము 21 కి 21 సీట్లు గెలిచామని అన్నారు. అసలు 2009లో నరసాపురంలో మీ నాన్న అల్లు అరవింద్‌ను గెలిపించుకోలేక పోయావ్ అంటూ బొలిశెట్టి సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై అల్లు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అల్లు అర్జున్ వ్యాఖ్యలపై అటు మెగా ఫ్యాన్స్, ఇటు జనసైనికులు సైతం కాస్త గుర్రుగానే ఉన్నారు. 


అయితే, బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్ కావడంతో బొలిశెట్టి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని కానీ, మెగా ఫ్యామిలీని కానీ ఎవరైనా ఏదైనా అంటే తాను తట్టుకోలేనని అన్నారు. ఓ మెగా అభిమానిగా మాత్రమే తాను అలా మాట్లాడినట్లు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని స్పష్టం చేశారు. కాగా, తాజాగా అల్లు అర్జున్‌తో.. తనకు, పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినందు వల్లే తాను అలా మాట్లాడానని పేర్కొన్నారు.


నంద్యాల టూర్ నుంచీ..


ఏపీలో ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. దీన్నీ మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటకలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒకప్పుడు అడవులను కాపాడేవారిని హీరోలుగా చూపించే వారని.. ఇప్పుడు స్మగ్లర్లు హీరోలుగా మారారని వ్యాఖ్యానించారు. ఇది పుష్ప సినిమాను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలని బన్నీ ఫ్యాన్స్ వాదన. అయితే, అంతా సైలెంట్ అవుతున్న తరుణంలో అల్లు అర్జున్ వ్యాఖ్యలతో మళ్లీ కౌంటర్స్ మొదలయ్యాయి.


Also Read: YSRCP : వైఎస్ఆర్‌సీపీలో రాజీనామాల విప్లవం - పెద్ద ఎత్తున రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పే చాన్స్