తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. అనుచరులతో సమావేశం అయిన ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కలిసే వరకు తాను రాజీనామా చేయబోనని జగ్గారెడ్డి తాజాగా ప్రకటించారు. బయటవారికంటే తమ పార్టీ వారే అనవసర ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్తానంటే అడ్డుకునే వారు లేరని అన్నారు. వ్యక్తిగత రాజకీయం కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టనని చెప్పారు. రాహుల్ నాయకత్వంలో మార్చి 21న లక్ష మందితో సభ నిర్వహిస్తానని, ఆ సభలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 


ఉక్రెయిన్ నుంచి తెలంగాణ వారిని రప్పించండి, ఖర్చులు మేమే భరిస్తాం - విదేశాంగ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి


సోనియా, రాహుల్‌ల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన సభకు హైకమాండ్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. జగ్గారెడ్డి రాజీనామా ప్రకటన చేసి.. అనుచరులతో సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవడంతో గురువారం ఆయనను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు కలిశారు. కొంత మంది ఏఐసిసి నేతలు కూడా ఫోన్ చేసి తొందరపడవద్దని  చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇస్తుందాలేదా అన్నదానిపై స్పష్టత లేకపోయింది. 


తెలంగాణ నేతల్లో ఆ మంచి గుణం భేష్! KTRకు పవన్ లేఖ - ఏపీలో లీడర్లకు చరకలు?


తాను చెప్పాలనుకున్నది నేరుగా హైకమాండ్‌కే చెబుతానని జగ్గారెడ్డి అంటున్నారు. మార్చి ఇరవై ఒకటో తేదీ లోపు హైకమాండ్ నుంచి పిలుపు రాకపోతే తాను నిర్వహించబోయే బహిరంగసభా వేదిక నుంచి రాజీనామా ప్రకటించి ఆ తర్వాత ఏదో ఓ పార్టీలో చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి నేరుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి బుజ్జగింపులు కోరుకుంటున్నారని వారు పిలిస్తే ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే జగ్గారెడ్డి విషయంలో కొంత మందితెలంగాణ కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకంటున్నారు. 


ఆయన ప్రతీ సారి పార్టీని ఇబ్బంది పెడుతున్నారని సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను పట్టుకుని వాటిని పీసీసీ చీఫ్‌కు అన్వయించి రచ్చ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికి అయితే కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగనుంది. వచ్చే నెల ఇరవై ఒకటో తేదీన ముందుగా చెప్పినట్లుగా జగ్గారెడ్డి బహిరంగసభ నిర్వహిస్తే ఆ రోజున కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.