YS Viveka Case :  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో అవినాష్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు రోజూ సంచలనం అవుతున్నాయి. అవినాష్ రెడ్డి విచారణకు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొడుతున్నారని సీబీఐనే రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు చెప్పింది కానీ ఎప్పుడు చేస్తామన్నది చెప్పలేదు. ఇప్పటికే అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోంది. ఈ విచారణను వీలైనంత వరకూ తప్పించుకుంటున్నారు అవినాష్ రెడ్డి.  


అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాల్లోనూ అవినాష్ రెడ్డి ఫెియల్


కొన్ని రోజుల క్రితం ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.  అవినాశ్‌ రెడ్డి అరెస్టు అంశాన్ని తెలంగాణ హైకోర్టు పూర్తిగా సీబీఐకే వదిలేసింది. ‘మీ పని మీరు చేసుకోండి’ అని సిబిఐ కి చెప్పేసింది. నిజానికి… హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడే అవినాశ్‌ రెడ్డి అరెస్టుకు సాంకేతికంగా అడ్డంకులు తొలగిపోయాయి.  అయితే అరెస్ట్ కోసం సీబీఐ ప్రయత్నాలు చేయలేదు. వినాశ్‌ అరెస్టును అడ్డుకునేందుకు వైసీపీ పెద్దలు కోర్టులద్వారా ‘జాప్యం’ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిపిస్తోంది.  
 
22న విచారణకు హాజరవడం డౌటే !  


సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన సమయంలో తల్లికి అనారోగ్యం కారణంగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు. తల్లికి అనారోగ్యం గురించి సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లాయర్లు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తల్లి వస్తున్న అంబులెన్స్ అవినాష్ రెడ్డికి ఎదురైంది. అక్కడే తల్లిని అవినాష్ రెడ్డి ఆమెను పరామర్శించి కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు కర్నూల్ కి వెళ్లారు..ఈ నేపథ్యంలో ఈనెల 22 వతేది విచారణకి హాజరుకావాలని వాట్సాప్ సందేశాన్ని పంపారు. మరి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ విచారకు హాజరవుతారా  అన్నది సస్పెన్స్ గా మారింది. తండ్రి జైల్లో ఉన్నారని..తల్లికి అనారోగ్యంగా ఉన్నందున తాను  హాజరు కాలేనని చెప్పే అవకాశం ఉందంటున్నరు. 


సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ విచారణ కోసం ప్రయత్నించే అవకాశం 


ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాలేదు. అత్యవసరం అని భావిస్తే రాతపూర్వకంగా ఇవ్వాలని వేకెషన్ బెంచ్ లో విచారణ జరిపేందుకు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టులో మళ్లీ వెకేషన్ బెంచ్ ముందు విచారణకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 


ఈ పరిణామాలు సీబీఐని అసహనానికి గురి చేస్తున్నాయా ?


వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మొదటి నుంచి  ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. చివరికి విచారణాధికారి కూడా మారారు. అయినా కేసు ముందుకెళ్తూనే ఉంది. కానీ సీబీఐకి మాత్రం ఆటంకాలు తప్పడం లేదు. ఇదంగా సీబీఐని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఇవాళ కాకపోతే రేపైనా అరెస్ట్ చేస్తారనే  వాదన  వినిపిస్తోంది.