Nizamabad BJP : హైదరాబాద్‌లో జరగబోయే జాతీయ కార్యవర్గం తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహానికి కారణమవుతోంది.  నిజామాబాద్ జిల్లా బీజేపీ పొలిటికల్ స్ట్రీట్‌లో నయా జోష్ నెలకొంది. హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, సికింద్రాబాద్ లో జరిగే సభను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో బీజేపీ ముఖ్య నాయకుల పర్యటనలు చేశారు. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. నేతల బైటక్ లలో క్యాడర్ కు జోష్ నింపేలా స్పీచ్ లు ఇస్తున్నారు. 


తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే


 నిజామాబాద్ జిల్లా విషయంలో పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజు జూలై 3న సికింద్రాబాద్లో నరేంద్రమోదీ, అమిత్, జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరుగనున్న బహిరంగ సభకు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను తరలించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందు కోసం రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కోఆర్డినేటర్లను, జాతీయ పార్టీ నుంచి  ఇన్చార్జులను నియమించారు. జాతీయ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ కు తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, నిజామాబాద్ రూరల్ కు కేంద్ర స్టీల్, గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే, ఆర్మూర్కు కేంద్ర రక్షణ, పర్యాటక సహా యమంత్రి అజయ్ భట్, బాల్కొండకు రాజస్థాన్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రసింగ్ రాథోడ్, బోధనక్కు మహారాష్ట్రకు చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీమతి విజయ్ రాహత్కర్, బాన్సువాడకు పశ్చి మబెంగాల్ పార్టీ అధ్యక్షుడు సుఖాంత్ మజుంలను నియమించారు. 


వైఎస్ఆర్‌సీపీలో కొత్త టెన్షన్ - ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు హాజరవుతారా ?


నిజామాబాద్ జిల్లాలో సెగ్మెంట్ల వారిగా నాయకులకు బాధ్యతలు అప్పగించి శ్రేణులను తరలించేందుకు కసరత్తులు చేస్తున్నారు. వీరంతా బూత్ స్థాయి కమిటీలతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని అన్ని అనుబంధ విభాగాల బాధ్యులు, సభ్యులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల్లో పరివార్ క్షేత్ర సమావేశాలు చేపట్టారు. హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ కు  అఫీషియల్స్ కోఆర్డినేషన్ ఇన్చార్జిగా జాతీయ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అర్వింద్ గత నాలుగు రోజులుగా అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షించుకుంటూ సమన్వయం చేస్తున్నారు. ముఖ్యనాయకుల పర్యటనలతో జిల్లా బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ పవర్ లోకి రావటమే ధ్యేయంగా కార్యకర్తలు కృషిచేయాలంటూ నాయకులు పిలుపునిస్తున్నారు.