బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ ( Ravela Kishore ) ఆ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లుగా ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ( Somu )  పంపిన లేఖలో తెలిపారు. కొంత కాలం నుంచి ఆయన బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ కొంత కాలం యాక్టివ్‌గానే ఉన్నప్పటికీ రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోకపోవడంతో కార్యకలాపాలు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వ అధికారిగా పని చేసిన రావెల కిషోర్ తెలుగుదేశం పార్టీ తరపున 2014లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పగెలుపొందారు.


అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్‌లో రచ్చ రచ్చ


ఆ తర్వాత ఆయనకు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. అయితే వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా మధ్యలోనే ఆయన పదవిని కోల్పోయారు. మంత్రి పదవిని తొలగించిన తర్వాత ఆయన టీడీపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. చివరికి టిక్కెట్ ఇవ్వరని తెలిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. జనసేనలో ఆయనకు మంచి ప్రాధాన్యమే లభించింది. తన సిట్టింగ్ స్థానం ప్రత్తిపాడు నుంచే జనసేన తరపున పోటీ చేసి పాతిక వేలకుపైగా ఓట్లు తెచ్చుకున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిపై వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి సుచరిత ఏడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 


చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్


రావెల కిషోర్ భారీగా ఓట్లను చీల్చడంతో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమరావతి ఉద్యమంతో పాటు.. అమరావతి రైతుల పాదయాత్రలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో మళ్లీ సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనను మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నదానిపై టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. 


వాట్ ఎన్ ఐడియా సర్ జీ! ఇట్లా కూడా దేవుడి మొక్కులు తీర్చుకోవచ్చా? వైరల్ అవుతున్న వీడియో


రావెల కిషోర్ బీజేపీకి ( AP BJP ) రాజీనామా చేసేశారు. తన రాజకీయ కార్యాచరణను ఆయన త్వరలోనే ఖరారు చేసుకునే అవకాశం ఉంది.