ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, ఆయన కుమార్తె పల్లవి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ వీరు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. పుష్పశ్రీవారి భర్త పరీక్షిత్ రాజు. ఆయన శుత్రచర్ల చంద్రశేఖర్ రాజు తండ్రి. మాజీ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖరరరాజు వైఎస్ఆర్‌సీపీలోనే ఉండేవారు. అయితే పార్టీ పట్ల వ్యతిరేకతతో ఇటీవల ఆయన దూరం జరిగారు. పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి ఉంది. ఓ సారి పార్టీ వేదికపై ఆమె కన్నీరు పెట్టుకోవడం సంచంలనం సృష్టించింది.
‘జగనన్న విద్యాదీవెన’కు నిధులు విడుదల, మీట నొక్కిన సీఎం - విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి నేరుగా
శత్రుచర్ల చంద్రశేఖరరాజు సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించినప్పటికీ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. పలుమార్లు వైయస్ జగన్ ను కలిసేందుకు ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వలేదని.. తమ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభివృద్ధి చేసిన వ్యక్తి ఈ రోజు వాళ్లకి అవసరం లేదని చంద్రశేఖర్ రాజు మీడియా సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తె శత్రుచర్ల పల్లవి ప్రకటించారు.త్వరలో టిడిపి పెద్దలను, కలిసి పార్టీ లో చేరినున్నట్లు ప్రకటించారు. అమరావతి అయినా... గిరిజన ప్రాంతమైన అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చంద్రశేఖర్ రాజు ధీమా వ్యక్తం చేశారు.
‘కడుపులో కాలిపోయి ఉన్నా సహజ మరణమా? ఇదంతా మన ఆంధ్రుల కర్మ’ - నాగబాబు
తమ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి రాజకీయాల్లో కి రావడం జరిగిందని శత్రుచర్ల పల్లవి ప్రకటించారు. గిరిజన సమస్యలపై ప్రజల తరపున పోరాటం చేస్తామని ..కురుపాం లో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తామన్నారు. త్వరలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతామని పల్లవి ప్రకటించారు. పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు మాత్రం వైఎస్ఆర్‌సీపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
చంద్రశేఖర్ రాజు తన కుమారుడు పరీక్షిత్ రాజును కాకుండా.. కుమార్తె పల్లవిని రాజకీయ వారసులిగా ప్రకటించడంతో .. పుష్పశ్రీవాణికి ఇంటిపోరు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. కురుపాం నుంచి ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన పుష్పశ్రీవాణి.. జగన్‌కు విధేయురాలిగా ఉన్నారు. ఆయితే తన భర్తకు ప్రాధాన్యం దక్కడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తూంటారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్‌కు కారణం అయిన మామ టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో డిప్యూటీ సీఎం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.