TDP  In YSRCP Trap :  రోడ్డుపై ఇద్దరు తిట్టుకుంటుంటే చూడడానికి జనం బానే  వస్తారు . తలో ప్రక్క నిలబడి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతారు . అంతమాత్రాన తిట్టుకుంటున్న  వాళ్ళను అభిమానిస్తున్నట్టు అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానమే . సరిగ్గా ఏపీ పాలిటిక్స్ లో అదే జరుగుతుంది . వైఎస్ఆర్‌సీపీ లీడర్లు ఒక మాట అంటే దానికి కౌంటర్ ఇస్తున్నామన్న భ్రమలో తాముకూడా తిట్లు .. బూతులు వాడుతున్నారు విపక్ష టీడీపీ నేతలు . అయితే ఇది మొదటికే మోసం వస్తుందన్న విషయాన్నీ మాత్రం గుర్తించడం లేదు . రెండు పార్టీలకు చెందిన విజయసాయిరెడ్డి -అయ్యన్నపాత్రుడు ల మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్ గురించి అందరికీ తెలిసిందే . నువ్వో తిట్టు తిడితే.. నేనో బూతు వాడతా  అన్నట్టు వారి మధ్య సోషల్ మీడియా యుద్ధం నడుస్తుంది . ఇది చోడవరం మహానాడు లో అయ్యన్న మంత్రి రోజా పై  చేసిన కామెంట్స్ తో పరాకాష్ట కు చేరింది . దీనికి సోషల్ మీడియా లోనూ .. లేదా సభలకు హాజరైన కార్యకర్తల నుండి తాత్కాలికంగా వచ్చే సపోర్ట్ తో ఈ విధానమే కరెక్ట్ అనే భ్రమలో టీడీపీ లీడర్లు ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


బూతులను సామాన్య జనం హర్షించరు ! 


నిజానికి ఈ టైపు వ్యవహారాన్ని సామాన్య జనం హర్షించరు . వారికి తమ సమస్యలపైనా.. కష్ట నష్ఠాలపైనా మాట్లాడే నాయకులు కావాలి . ఒకవేళ అధికారంలో ఉన్నవారినుండి వారికి కావాల్సింది లభించకపోతే .. విపక్షాలు తమ తరపున నిలబడాలని కోరుకుంటారు . అసలు ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ లోపముంది .. దేనివల్ల తమకు జీవనం కష్టంగా మారింది వంటి విషయాల పట్ల అవగాహన కోరుకుంటారు . అవి అందించాల్సిన భాద్యత విపక్షాలదే . అదే ప్రజాస్వామ్యం లోని ముఖ్యమైన అంశం . అయితే టీడీపీ  ఆ లాజిక్ ని మిస్ అవుతుంది . జనంలో ఆ అవగాహన లేదా అధికారంలోకి వస్తే తాము ప్రజలకు ఏం  చేస్తాము అన్న విషయాలకు బదులు వైసీపీ లీడర్లను తిడుతూ ఉంటే  జనం ఎంటర్టైన్మెంట్ గా ఫీలవుతారో ఏమో గానీ .. ఎన్నికల సమయంలో ఈ తరహా వ్యవహారాలు వారిని ఓటింగ్ వైపు నడిపించవు అని విశ్లేషకులు అంటున్నారు . 


రోజా కామెంట్స్‌పై అయ్యన్న తగ్గలేదుగా! ఆ మాటలేంటి, ఆ రచ్చేంటి? పక్కనే లేడీస్, అయినా అవే వ్యాఖ్యలు!


వైఎస్ఆర్‌సీపీ నేతలు ఓ మాట అనగానే రెండు మాటలు అంటున్న టీడీపీ నేతలు 


2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చి నిబద్దత నిరూపించుకోవాలంటూ వైఎస్ఆర్‌సీపీ  చేసిన సవాల్ ను స్వీకరించి ముందు వెనుకా చూసుకోకుండా బయటకు వచ్చేసింది టీడీపీ అనే వ్యాఖ్యానాలు ఇప్పటికీ ఉన్నాయి . దానితో అటు బీజేపీ కీ దూరం అయింది . ఇటు అధికారమూ పోగొట్టుకుంది తెలుగుదేశం . ఆసమయంలో సాక్షాత్తూ ప్రధాన మోదీ నే టీడీపీ పార్టీ వైఎస్ఆర్‌సీపీ  ట్రాప్ లో పడింది అని అన్నారు కూడా .  మరలా 2024 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ట్రాప్ లోనే పడిపోయింది అంటున్నారు పరిణామాలు గమనిస్తున్నవారు . 


ఎంపీ రఘురామకు హైకోర్టులో చుక్కెదురు! మేం అలాంటివాళ్లం కాదు - ఏపీ హైకోర్టు


వైఎస్ఆర్‌సీపీ ట్రాప్‌లో టీడీపీ పడిందా ?


అవతల వైఎస్ఆర్‌సీపీ  నుండి రెచ్చగొట్టేలా  ఒక్క తిట్టు .. లేదా విమర్శ రాగానే .. ఇవతల నుండి కూడా బూతుల వర్షం మొదలవుతుంది . వైసిపీ మీద కోపమో లేక అధినేత చంద్రబాబు కళ్ళలో పడాలన్న కోరికో గానీ వాడుతున్న తిట్లకు హద్దే లేకుండా పోతుంది . కానీ దీనివల్ల ఒకప్పుడు హుందాతనమైన వ్యవహార శైలికి పేరుపడ్డ టీడీపీ సామాన్య ,మధ్యతరగతి ప్రజలకు దూరం  అయిపోతుందన్న భావం అయితే రాజకీయ వర్గాల్లో కలుగుతోంది . మరి దీన్ని గమనించి చంద్రబాబు ఈ తరహా వ్యవహార శైలికి చెక్ పెడతారో లేదో చూడాలి !