Hindupur YSRCP Politics :   హిందూపురం వైఎస్ఆర్‌సీపీ అసమ్మతి నేతలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితో కనీసం కలిసేందుకు కూడా చాన్స్ ఇవ్వబోమని సంకేతాలుపంపారు.   రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ అనంతపురం పర్యటనే.ముఖ్యమంత్రి పర్యటనలో అసమ్మతి నేతలను కలిసేందుకు కూడా ముఖ్యమంత్రి ఇష్టపడకపోవటంతో అసమ్మతి నేతకలు ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పర్యటనలో  ఎమ్మెల్సీ  ఇక్బాల్‌తో  మాట్లాడిన ముఖ్యమంత్రి హిందూపురంలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీసి వివరాలన్నింటిని ఒఎస్డీకి చెప్పమన్నట్లు సమాచారం.


రోజా కామెంట్స్‌పై అయ్యన్న తగ్గలేదుగా! ఆ మాటలేంటి, ఆ రచ్చేంటి? పక్కనే లేడీస్, అయినా అవే వ్యాఖ్యలు!


అందుకే  ఎమ్మెల్సీ  ఇక్బాల్ పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ లోనే ఒఎస్డీతో సుదీర్ఘంగా సమావేశమై ఇటీవల కాలంలో అసమ్మతి నేతలు ఏమేమి చేశారన్నదానిపై వివరించినట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకొన్న అసమ్మతి నేతలకు పార్టీలో ఏం జరగుతుందో అన్న టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి రాకపోవడం, మరోవైపు ఇక్బాల్ సుదీర్ఘంగా ఒఎస్డీ తో సమావేశం కావడం వెనుక వున్న ఆంతర్యం తెలుసుకొన్న వైఎస్ఆర్‌సీపి అసమ్మతి నేతలకు భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న సందిగ్దంలో పడ్డారు.


ఇఫ్పటికే నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా ,తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్న ఇక్బాల్ వర్గం రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెల్తారు.... వాటికి అడ్డుకట్ట వేసుందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు వైఎస్ఆర్‌సీపీ అసమ్మతి నేతలు, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఆద్వర్యంలో మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీ,కొండూరు వేణుగోపాల్ రెడ్డి లాంటి బలమైన నేతలంతా కలిసి స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ తో ఇటీవల కాలంలో కర్ణాటకలోని ఓ రిసార్ట్ లో సమావేశం అయ్యి అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు.వీటన్నిటిని గమనించిన అదిష్టానం కావాలనే ముఖ్యమంత్రి పర్యటనలో అసమ్మతి నేతల వైకరి పట్ల కఠినంగా వ్యవహిరంచి పార్టీకి విధేయులుగానే వుండాలి తప్ప అల్టిమేటం లు జారీ చేస్తే పరిస్థితులు ఇదే విధంగా వుంటాయన్న హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 


పన్నులతో బాదుతున్న జగన్‌ను తిరిగి బాదాలి - చోడవరంలో చంద్రబాబు పిలుపు


అధిష్టానం ఈ విధంగా స్పందిచండంతో అసమ్మతి కీలక నేతలు తమ అనుచరులకు ముఖం చూపించలేక రానున్న రోజుల్లో అదిష్టానాన్ని కాదని ఎలాంటి కార్యక్రమాలు చేయలేని పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంఎల్సీ ఇక్బాల్ మాత్రం ముఖ్యమంత్రి అండతో నియోజకవర్గంలో అసమ్మతి నేతలకు చెక్ పెట్టేందుకు పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నాడు.మంత్రులను కలిసి పరిస్థితిని వివరించినప్పటికి ముఖ్యమంత్రి స్థాయిలో హెచ్చరికలు రావడంతో అసమ్మతి నేతలకు మింగుడుపడటంలేదు.