Demolition Politics : రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ ఏకపక్ష దాడి చేస్తోంది. కూల్చివేతల కారణంగా ప్రభుత్వంపై  ప్రజలు తిరగబడే స్థాయికి వచ్చారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. నెక్ట్స్ మూసి పరివాహక ప్రాంతాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. కూల్చివేతలకు ముహుర్తం ఖరారు చేసుకుంది. మార్కింగ్ చేసేస్తున్నారు. అయితే చాలా కాలంగా మూసిని ఆక్రమించుకుని ఉంటున్నారు కాబట్టి ఉన్న పళంగా వారిని తరిమేయకుండా.. పేదకు ఇళ్లు ఇస్తున్నారు. ఇప్పటికే నిర్మితమైన డబుల్ బెడ్ రూం ఇళ్లు పదిహేను వేలు వారికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 


కూల్చివేతలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం


నేటి రాజకీయాలల్లో సోషల్ మీడియా ప్రచారాల గురించి చెప్పాల్సిన పని లేదు. పొలిటికల్ ట్రెండ్స్ ను అవే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూల్చివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి అంతా నేరుగా రేవంత్ రెడ్డినే విమర్శిస్తున్నారు. ఆయనే మా ఇళ్లను కూలగొడుతున్నారని చెబుతున్నారు. మూసి దగ్గర కొంత మంది అలాగే చెబతున్నారు. ఇక ప్రజలు తిరగబడటమే మిగిలిందన్నట్లుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం ఉంది. 


తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన


నింపాదిగా పని చేసుకుపోతున్న రేవంత్ రెడ్డి


అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసలు కేర్ చేయడం లేదు. తాను తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఉపయోగం ఏమిటో ప్రజలకు ఖచ్చితంగా తెలుసని వారు మద్దతు ఇస్తారని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే ఆయన తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని లెక్క చేయకుండా పని చేసుకుంటూ పోతున్నారు. అతి పెద్ద డి్మోలిషన్ డ్రైవ్ కు ప్రణాళికలు సిద్దం చేశారు. హైదరాబాద్‌లో దశాబ్దాలుగా మూసి ఆక్రమణలు జరుగుతున్నాయి. ఓ నది కాస్తా.. చిన్న మురికి కాలువగా మారిపోయింది. ఇప్పుడు అది మొత్తం క్లియర్ చేయబోతున్నారు. అక్కడి నిర్వాసితులకు నష్టపరిహారం...పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయినా అక్కడ కూల్చివేతల వల్ల జరిగే నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏ మాత్రం ఆలోచించడం లేదు. 



Also Read: KTR : అమ్మమ్మ ఊరి పిల్లలకు కేటీఆర్ బడి గిఫ్ట్ - సొంత డబ్బుతో కొత్త బిల్డింగ్ !




ఏదైనా పని ప్రారంభించినప్పుడు సాఫీగా సాగిపోతే ఆ పనికి లేదా ఆ పని ద్వారా వచ్చే విజయానికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఎంతో పోరాటం ద్వారా సాధించే విజయమే గుర్తుండిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ ను తాను అనుకున్నట్లుగా తీర్చిదిద్దడానికి మొదట్లో వ్యతిరేకత కనిపించినా.. తరవాత ప్రజలు అర్థం చేసుకుంటారని గట్టిగా నమ్ముతుతున్నారు. నిజంగా మూసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి.. అనుకున్న విధంగా ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే.. రివర్ సిటీగా  హైదరాబాద్ మారిపోతుంది. బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చెరువులు, నాలాల ఆక్రమణలు లేకపోతే.. ఎంత వర్షం పడినా ముంపు ఉండదు. మళ్లీ ప్రజా తీర్పునకు వెళ్లే సరికి ఈ ఫలితాలు కనిపిస్తాయని ప్రజలు ఆశీర్వదిస్తారని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు.