కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్ ఇచ్చిన సంపన్న తెలంగాణ రాష్ట్రం ముదనష్టపు బీఆర్ఎస్  పాలనలో అప్పులు కుప్పగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయిందని సాక్షాత్తు కాగ్ రిపోర్ట్‌ చెప్తోందన్నారు. బడ్జెట్ రణాలు,  గ్యారంటీలు కలిసి రాష్ట్రాన్ని నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశాయన్నారు. 


తెచ్చిన అప్పులు ఏ కలుగులో ఉన్నాయో.. ఎవరి బొక్కసంలో భద్రంగా ఉన్నాయో ప్రజలంతా అర్థం  చేసుకోవాల్సిన సమయం ఇదే అన్నారు మధుయాష్కీ. ఇవన్నీ ప్రగతి భవన్ నేలమాళిగలో దాక్కున్నాయి కనుకే దేశమంతా ఎన్నికల ఖర్చును భరిస్తాననే స్థాయికి కేసీఆర్  అవినీతి చేరిందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటినుంచి గత తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలని తాగుడుకు బానిసలు చేసి.. రక్తమాంసాలను సైతం పీక్కుతిని 2 లక్షల కోట్ల రూపాయాలుగా  మార్చుకున్నాడని ఆరోపించారు. అసరా పింఛన్ల రూపంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విదిల్చిన ముష్టి... కేవలం 68వేల కోట్ల రూపాయాలు మాత్రమేనని అన్నారాయన.  


తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిట్టనిలువునా చంశారని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందళ్ల వంటి మూడు చెక్  డ్యాములు కట్టి.. లక్ష కోట్ల రూపాయాలను కేసీఆర్ దోచేశాడని ఫైరయ్యారు. కాళ్లేశ్వరం నీళ్లు అని చెప్తున్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్,  పొలాలకు నీళ్లు తీసుకెళ్లే డిస్టిబ్యూటరీ కెనాల్స్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భూములకు పారుతున్న నీళ్లన్నీ నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు,  వాటికి తవ్విన కాలువల ద్వారా మాత్రమే ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక వినానం వైపు తీసుకెళ్లిన్న పొలిటికల్ టెర్రరిస్ట్ కేసీఆర్‌కు తెలంగాణ బిడ్డలు వచ్చే ఎన్నికల్లో  మర్చిపోలేని గుణపాఠం చెప్తారన్నారు మధుయాష్కీ. 


మద్యం ద్వారా కేసీఆర్‌కు ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే.. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.68,065.36కోట్లు మాత్రమే ఖర్చు  పెట్టాడంటూ లెక్కలు చూపించారు. మద్యం ద్వారా 2014-15లో రూ.10,238 కోట్లు ఆదాయం వస్తే... ఆ ఏడాదిలో ఆసరా పింఛన్ల కోసం రూ.1,317.77 కోట్లు ఖర్చు చేశారు.  2015-16లో మద్యం ద్వారా రూ.12,200 కోట్ల ఆదాయం వస్తే.. ఆసరా పింఛన్ల కోసం రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అలాగే, 2016, 17లో మద్యం ద్వారా  రూ.14,092కోట్లు ఆదాయం రాగా... ఆసరా పింఛన్ల కొసం రూ.4,693 ఖర్చు చేశారు. 2017-18లో మద్యం ద్వారా రూ.17,683 కోట్లు ఆదాయం వస్తే... ఆసరా ఫించన్ల కోసం  రూ.5,330.59 కోట్లు ఖర్చు చేశారు. ఇక, 2018-19లో మద్యం ద్వారా రూ.20,447కోట్లు ఆదాయం వస్తే... పింఛన్ల కోసం రూ.5,300 కోట్లు ఖర్చు చేశారన్నారు.


అలాగే.. 2019-20లో మద్యం ద్వారా రూ. 22,209 కోట్లు ఆదాయం రాగా.. ఫించన్ల కోసం ఖర్చు చేసింది రూ.12వేల కోట్లు. 2021-22లో మద్యం ఆదాయం రూ.30,  733కోట్లు కాగా... పింఛన్ల కోసం ఖర్చు చేసింది రూ.11,726 కోట్లు. 2022-23లో మద్యం ఆదాయం రూ.35,145కోట్లు.. పింఛన్ల ఖర్చు రూ.11,728కోట్లు, 2023-24లో  మద్యం ఆదాయం రూ.15,346 కోట్లు.. పింఛన ఖర్చు రూ. 12వేల కోట్లని లెక్కలు చెప్పారు మధుయాష్కీ.