Congress Atam bomb: అరెస్టులకు భయపడబోనని రెండు నెలలు జైల్లో పెట్టిన యోగా చేసి ఫిట్‌గా తయారయ్యి పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత వారం రోజుల నుంచి కేటీఆర్ ఏదో ఓ సందర్భంలో అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు తనను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందిందేమో కానీ.. మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను జైలుకెళ్లడం ఏమో కానీ పొంగులేటి వెళ్తాడని మండి పడుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా అరెస్టు చేస్తే జైలుకెళ్లేందుకు సిద్దమేనని అంటున్నారు.
ఫార్ములా ఈ రేస్ కంపెనీకి రూ.55 కోట్లు తరలింపుపై కేసు
ఫార్ములా ఈ కార్ కేసు విషయంలో జరిగిన రూ. 55 కోట్ల గల్లంతు వ్యవహారంలో తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ మాసికంగాగా ప్రిపేర్ అయిపోతున్నారు. ఫార్ములా ఈ రేసు కోసం తాము నిర్వహణ సంస్థకు రూ. 55 కోట్లు ఇచ్చామన్నది నిజమేని అయితే అది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఆ రేసు నిర్వహించామన్నారు. అంతకు ముందు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీ రెండో విడత స్పాన్సర్ చేయలేదని.. అందుకు నిర్వహణ ఖర్చును తామే భరిస్తామని నిర్వహణ కంపెనీకి చెప్పామన్నారు. అందులో భాగంగానే రూ. 55 కోట్లు బదిలీ చేశామన్నారు. ఈ రేసును క్యాన్సిల్ చేసినందునకు.. రేవంత్ రెడ్డిపైనే కేసులు పెట్టాలన్నారు.
అసలు ఈ వివాదంలో ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు కానీ దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు బయటకు వెళ్లాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. . కానీ హెచ్‌ఎండీఏ నిధులను బదిలీ చేయడానికి కనీసం చిన్న అనుమతి కూడా ఎవరూ ఇవ్వలేదని తెలుస్ోతంది. ప్రభుత్వ నిర్ణయం అని కేటీఆర్ చెబుతున్నా.. కేబినెట్‌లో కనీసం నిర్ణయం తీసుకోలేదని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ చెబితేనే బదిలీ చేశామని నాటి కీలక అధికారి అర్వింద్ కుమార్ స్పష్టమైన వివరణ ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏసీబీ త్వరలో నోటీసులు జారీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో అరెస్టుకు తాను సిద్ధమని కేటీఆర్ అంటున్నారు.
కేటీఆర్ మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల వల్ల ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కూడా తప్పనిసరి. ఇప్పటికే గవర్నర్ కు ఏసీబీ అధికారులు అరెస్టు అనుమితి కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ వైపు నుంచి ఇంకా అనుమతి వచ్చిదో రాలేదో తెలియదు. కానీ గవర్నర్ర తో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తోంది. అందుకే కేటీఆర్ రాజ్ భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.