వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ( Vijay Sai Reddy )  పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ( Jagan ) కీలక బాధ్యతలు ఇచ్చారు. పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ ఇంచార్జ్‌గా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం పార్టీ పరంగా విజయసాయిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇక నుంచి ఆయన అన్ని అనుబంధ విభాగాల బాధ్యతలు కూడా చూసుకుంటారు. అనుబంధ విభాగాలు అంటే వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) యువత, మహిళా విభాగం, విద్యార్థి , కార్మిక ఇలా అన్ని అనుబంధ విభాగాలకూ విజయసాయిరెడ్డి ఇంచార్జిగా వ్యవహరిస్తారు. వాటి పనితీరుకు బాధ్యత వహిస్తారు.


ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఆయన చూసుకుంటున్నారు. వాటికి అదనంగా ఈ బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా కూడా కొనసాగుతారని ప్రత్యేకించి నియామక పత్రంలో చెప్పలేదు  అలాగని అనుబంధ విభాగాలను మాత్రమే చూసుకుంటారని కూడా లేదు. అందుకే ఆయన అదనంగా అనుబంధ విభాగాలను చూసుకుంటారని చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి  హఠాత్తుగా పార్టీ బాధ్యతలను పెంచడం వెనుక కీలక అంశాలున్నాయని వైఎస్ఆర్‌సీపీలోని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


కొడాలి, వెల్లంపల్లి హీరోలుగా సినిమాలు - జగన్‌కు సలహా ఇచ్చిన మెగా బ్రదర్


విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ( Rajya Sabha Member ) . ఆయన పదవీ కాలం జూన్‌తో ముగియనుంది. సీఎం జగన్ మరోసారి పొడిగింపు ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు. అయితే సీఎం జగన్‌కు మాత్రం విజయసాయిరెడ్డిని పార్టీ బలోపేతం కోసం వాడుకోవాలని నిర్ణయించుకున్నారని అందుకే రాజ్యసభ రెన్యూవల్ ఇవ్వరని.. పార్టీ బాధ్యతలు ఇస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ రాజ్యసభ సభ్యుల ఎంపిక కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ నాలుగు వైఎస్ఆర్‌సీపీకే దక్కుతాయి. ఓ సీటును ఉత్తరాది పారిశ్రామికవేత్తకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన సీట్లలో ఒకటి మైనార్టీకి ..మిగిలిన వాటిలో బీసీ వర్గాలకు కేటాయించాలని భావిస్తున్నారు. 


వివేకా హత్య కేసులో జగన్‌పై అనుమానం - లోకేష్ తీవ్ర ఆరోపణలు !


సామాజిక సమీకరణాలు కలసివచ్చే పరిస్థితి లేకపోవడం ... వైఎస్ఆర్‌సీపీ అంతర్గత రాజకీయాలు కూడా ఇబ్బందికరంగా మారడంతో విజయసాయిరెడ్డిని పార్టీ పదవులకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోందని వైసీపీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. రాజ్యసభ సభ్యుడయినప్పటి నుండి విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ కార్యకలాపాలు చక్కబెట్టేవారు. ఇక ముందు ఆయనకు బదులుగా ఇతర ఎంపీలు ఆ  బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.