వివేకా  హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ( CM Jagan ) అనుమానంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) వ్యాఖ్యానించారు. తనపై అసత్య వార్తలు రాశాని దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు మరోసారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.  వివేకా హత్య ( YS Viveka Murder Case ) కేసులో ఎవరున్నారో వివేకా కుమార్తె సునీత స్పష్టంగా చెప్పారని ఆ విషయం పై ఉలుకు లేదన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారని.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. సీబీఐ పై కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానన్నాని.. 2019లో చంద్రబాబు ( Chandra babu ) చంపారు అన్న వ్యక్తి అధికారం లో వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని ప్రశ్నించారు.  అవినాష్ రెడ్డి గుండె పోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారన్నారని మండిపడ్డారు. 
 
తనపై తప్పుడు వార్తలు రాసినందుకు ది వీక్ మ్యాగజైన్ వాళ్లు క్షమాపణచెప్పారని.. జగన్మోహన్ రెడ్డి పత్రిక క్షమాపణ చెప్పలేదన్నారు.  రెండు సంవత్సరాల మూడు నెలలు అయిందని ఎంత కాలమైనా పోరాడతానన్నారు. ఎన్నాళ్ళు మా పై తప్పు వార్త లు రాస్తారని లోకేష్ ప్రశ్నించారు.  జగన్ వలె 16నెలలు జైల్ కి వెళ్లి కోర్టు కి రాలేదని  ప్రజా సమస్యలు పోరాటం కోసం కృషి చేస్తుంటే మా పై తప్పు వార్త లు రాస్తున్నారని మండిపడ్డారు. మాతో పాటు మా నాయకులు కూడా పరువు నష్టం దావా వేశారన్నారు.  జగన్మోహనరెడ్డి ఫ్యాక్షనిస్టు అని మండిపడ్డారు. 


పవన్ కల్యాణ్‌కు ( Pawan Kalyan ) మద్దతుగా ట్వీట్స్ పెట్టడంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలపై లోకేష్ స్పందించారు. తాను ఎవరి పై ట్వీట్ పెట్టాలో వారు చెప్పాలా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ఓటీపీకి, ఓటీటీకి తేడా తెలియదన్నారు.  ఇప్పుడు సినిమా పరిశ్రమపై పడ్డారని సినిమా ఇండస్ట్రీ పై పడ్డారు. ఇండియా లో ఎక్కడా లేని షరతులు పెట్టారని విమర్శించారు.  చంద్రబాబు హయాంలో  5.4 లక్షల ఉద్యోగాలు కల్పన అని గౌతం రెడ్డి ( Goutham Reddy ) చెప్పా రని  గుర్తు చేశారు. ఇప్పటికే నాలుగు న్నర లక్షల కోట్లు అప్పు చేశారు మూడు సంవత్సరాలు లో పది లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తి మీద పెట్టి వెళ్తారన్నారు. కొత్త రాజదాని అని ఏం పీకారు...అదానీ డేటా సెంటర్ ముంబై పోయింది  ఏపీ పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలు లో పెడుతున్నారు ...వైఎస్ఆర్‌సీపీ నేతలంతా  గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు.  


కొత్త జిల్లాల ఏర్పాటు చేసే అర్హత జగన్మోహనరెడ్డి కి లేదని .. ఆ జిల్లాల విభజనకు చట్టబద్దత లేదని లోకేష్ స్పష్టం చేారు. జనగణన జరగాల్సి  ఉందని జరగకుండా జిల్లాలు విభజన చేసే హక్కు ప్రభుత్వానికి లేదని లోకేష్ స్పష్టం చేశారు. వాలంటీర్లను అన్ని విధాలుగా వాడుకుంటున్నారని..కానీ వారికి ఐదు వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని విమర్శలు  గుప్పించారు.