Chandrababu On Madhav :   వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోల వివాదం ఇంకా నడుస్తోంది. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. అరటి తోటలు తగలబెడితే ఎంపీని చేశారని.. బట్టలిప్పదీసుకున్నారు కాబట్టి కేంద్రమంత్రిని చేస్తారేమోనని సెటైర్లు వేశారు. చంద్ర‌బాబు న‌వ్వుతూనే వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికి వాటిలో అంత‌ర్యం ఎంట‌నేది అంతుప‌ట్టటం లేద‌ని సొంత పార్టీ  నేత‌లే అంటున్నారు.అర‌టి తోట‌ని త‌గ‌ల పెట్టిన వ్య‌క్తి ఎంపీ అయితే,మ‌రో ఎంపీ బ‌ట్ట‌లు విప్పార‌ని, ఆయ‌న కేంద్ర మంత్రి అవుతారేమో అంటూ చంద్ర‌బాబు బ‌హిరంగ వేదిక పై కామెంట్స్ చేశారు.చంద్ర‌బాబు కామెంట్స్ తో ఆ పార్టీ  నాయ‌కులు అప్పుడు కామెడీగా న‌వ్వుకున్నా,ఆ త‌రువాత ఆయ‌న అన్న మాట‌లు వెనుక అంత‌ర్యం ఎంట‌నే దాని పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ గా మారింది.చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఈ వివాదంపై ఇంత వరకూ కేంద్రం స్పందించలేదన్న అసంతృప్తి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 


దేశవ్యాప్తంగా వైరల్ అయిన వీడియో 


ఎంపీగా ఉన్న గోరంట్ల మాద‌వ్ గా చెబుతున్న వీడియోలో పూర్తిగా అస‌భ్యంగా ఉంది.అదే వీడియో బాగా వైర‌ల్ అయ్యింది.ఎంపీ కావ‌టంతో ఢిల్లీ గ‌ల్లీల్లో కూడ ఇదే వీడియో హ‌చ‌ల్ చేసింద‌ని,దీని వ‌ల‌న తెలుగు వారి ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌ల‌గ‌టంతో పాటుగా పార్ల‌మెంట్ సాక్షిగా దేశం ప‌రువు కూడ పోయిందంటూ ప్ర‌తిప‌క్షాలు విమర్శలు గుప్పించాయి.  ఎపీలోని బీజేపి నేత‌లు కూడ గోరంట్ల వీడియోల పై కామెంట్స్ చేశారు. అయితే కేంద్రంలోని బీజేపి పెద్ద‌లు, కాని కేంద్ర ప్ర‌భుత్వం కాని ఈ విష‌య‌లో క‌నీసం ఆరా తీయ‌లేద‌నే అసంతృప్తి వ‌ల‌నే చంద్ర‌బాబు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని చెబుతున్నారు. వైసీపీ ఎంపీలంతా ప్ర‌స్తుతం, కేంద్ర ప్ర‌భుత్వానికి ఫుల్ స‌పోర్ట్ ఇచ్చారు.పార్ల‌మెంట్ స‌మావేశాల్లో జ‌రిగే చ‌ర్చ‌లు,బిల్ల‌ల ఆమోదంలో మెజార్టిగా ఉన్న వైసీపీ ఎంపీలు బీజేపికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. దీంతో కేంద్రం కూడా ఈ విషయాన్ని అంత‌గా ప‌ట్టించుకున్న దాఖాలాలు లేవ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయ‌ని చెబుతున్నారు.


వీడియోపై విచారణకు టీీడీపీ డిమాండ్ - కేంద్రంలో కనిపించని స్పందన


గోరంట్ల మాదవ్ పేరు మీద వ‌చ్చిన వీడియో పై విచార‌ణ చేయించాల‌ని,మెద‌టి నుండి టీడీపీ డిమాండ్ చేస్తుంది.అయితే దాని గురించి వైసీపీ నేత‌లు ప‌ట్టించుకోలేదు.ఆ త‌రువాత అదికార పార్టీ లో ఈ వ్య‌వ‌హ‌రం తీవ్ర స్దాయిలో చ‌ర్చ జ‌రిగింది.జ‌గ‌న్ ఈ విష‌యంలో సీరియ‌స్ గా ఉన్నార‌ని,ఎంపీని స‌స్పెండ్ చేస్తార‌ని ప్ర‌చారం కూడ జ‌రిగింది.అయితే దీని పై టీడీపీ రాజ‌కీయం ఉదృతం చేయ‌టంతో ,వైసీపీ కూడ అదే స్దాయిలో ఎదురు దాడి చేసింది.దీంతో టీడీపీ నేత‌లు విదేశాల్లో స‌ద‌రు వీడియో కు  సాంకేతిక ప‌రీక్ష‌లు చేయించి ఆ వీడియో గోరంట్ల మాద‌వ్ దేన‌ని ఒక నివేదిక‌ను కూడ వెలుగులోకి తీసుకురావ‌టంతో అది కూడ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 


సీఐడీ చీఫ్ జోక్యం తర్వాత మరింత పెరిగిన టీడీపీ పట్టుదల


ఊహించ‌ని విధంగా  సీఐడీ చీఫ్ మీడియా స‌మావేశం పెట్టిన‌,స‌ద‌రు వీడియో పై స్పందించ‌కుండా,ఆ వీడియో ఎంపీదే అని ప్రైవేట్ సంస్ద ఇచ్చిన నివేదిక త‌ప్ప‌ని ప్ర‌క‌టించారు.అస‌లు వీడియో పై స్పందించ‌కుండా,టీడీపీ ప్రైవేట్ సంస్ద తో చేయించిన‌,విచార‌ణ నివేదిక పై ఎటువంటి సంబందం లేని సీఐడీ స్పందించ‌టం పై కూడ చ‌ర్చ మెద‌లైంది..ఇంత జ‌రుగుతున్నా కేంద్రంలోని పెద్ద‌లు మాత్రం నోరు మెద‌ప‌టం లేద‌నే చంద్ర‌బాబు ,కేంద్రాన్ని ఉటంకిస్తూ ఇలా మాట్లాడార‌ని కూడ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.