Chandrababu Preparations : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని చంద్రబాబు పిలుపునివ్వడమే కాదు ఆయన కూడా రెడీ అవుతున్నారు. పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసుకునే కసరత్తును కూడా జోరుగా సాగిస్తున్నారు. నియోజకవర్గాల ఇంచార్జులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి చెప్పాల్సింది మొహం మీదనే చెబుతున్నారు. ఏం మార్చుకోవాల్సి ఉంది.. ఎలా మారాలి.. ఇంకా ఎంతలా పోరాడాలి అనే అంశంపై స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపుతున్నారు. కొంత మందికి అసలు పనితీరు దారుణంగా ఉందని ఈ సారి టిక్కెట్ లేదని నేరుగా చెప్పినట్లుా కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నారు. 60 నియోజకవర్గాల ఇంచార్జులతో ముఖాముఖి భేటీ అయ్యారు.  చెప్పాల్సింది చెప్పి పంపించారు. 


ఇంచార్జులకు దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబు!


తెలుగు దేశం పార్టీలో నియోజకవర్గ ఇంచార్జ్ ల పనితీరుపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో నియోజకవర్గ ముఖ్య నేతలందర్నీ పిలిచి మాట్లాడేవారు. ఈ సారి అలాంటి  ట్రెండ్ మార్చారు.  నియోజకవర్గ ఇంచార్జ్ ను మాత్రమే పిలుస్తున్నారు. వన్ టు వన్ మాట్లాడుతున్నారు. ఆ నియోజకవర్గంలో గత మూడున్నరేళ్లుగా చేసిన కార్యక్రమాలు... కార్యకర్తలకు అండగా నిలడినవైనం.. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఇలా ప్రతీ అంశంపైనా సేకరించిన సమాచారంతో  ఇంచార్జ్‌ల పనితీరును సమీక్షిస్తున్నారు. అలా ప్పటి వరకూ దాదాపుగా అరవై నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. 


పనితీరు మెరుగ్గా లేని వారికి మొహం మీదనే  చెబుతున్న చంద్రబాబు


బాగా పనిచేస్తున్న  నియోజకవర్గ ఇంచార్జ్ లను చంద్రబాబు అభినందిస్తున్నారు. టిక్కెట్‌పై భరోసారి ఇచ్చి మరింత బాగా పని చేయాలని చెప్పి పంపిస్తున్నారు.  సమర్థవంతంగా లేని వారిని మీరు ఎన్నికలు సిద్దంగా ఉన్నారా....ప్రత్యామ్నాయం చూసుకోమంటారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మెంబర్ షిప్ కార్యక్రమం మొదలుకొని...బాదుడే బాదుడు వరకు అన్ని అంశాలపై రివ్యూ చేస్తున్నారు. నేతల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని రివ్యూలలో బయటకు తీసి సమీక్ష చేస్తున్నారు. సమగ్రమైన, లోతైన నివేదికలతో నేతలను ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణతో పాటు స్థానిక సమస్యలపై, ప్రత్యర్థి నేతలపై పోరాటాల విషయంలో కూడా ఇంచార్జ్ లతో రివ్యూ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గాలేని వారు పనితీరు మార్చులకోవాలని సూచిస్తున్నారు. ఇంచార్జ్ గా ఉన్నవారు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని.... ఏకపక్షంగా ఉంటే ఉపేక్షించేది లేదని కూడా చెపుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వంపై  వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందని...అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని కూడా చంద్రబాబు నేతలకు తేల్చి చెపుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  


పని చేయకుండా టిక్కెట్లపై ఆశలు పెట్టుకోవద్దని తేల్చేస్తున్న చంద్రబాబు !


ముఖాముఖి సమీక్షలు చేస్తున్న వారందరికీ చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. అలా సమీక్షలకు వెళ్లి వచ్చిన వాళ్లు సోషల్ మీడయాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. అయితే ఎవరికీ టిక్కెట్లు ఖరారు చేయలేదని   సమీక్షలను నేతలు అంతా సీరియస్ గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని...అంతిమంగా పనితీరే ప్రామాణికం అని గుర్తుపెట్టుకోవాలని టీడీపీ హైకమాండ్ సూచిస్తోంది. ఈ సమీక్షల సమయంలో చంద్రబాబు ఎక్కడెక్కడ మార్చుకోవాలో కూడా చెప్పి పంపుతూండటంతో నేతలు  నియోజకవర్గాలకు వెళ్లి ..  కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు.